గెస్ట్ రోల్ చేయాలంటే రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సిందే.. హీరోయిన్ డిమాండ్.. ఓకే చెప్పిన మేకర్స్..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజాహెగ్డే ఒకరు. ఇప్పటీకే ప్రభాస్‏తో 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తుండగా.. అటు అక్కినేని అఖిల్ సరసన 'మోస్ట్

గెస్ట్ రోల్ చేయాలంటే రెమ్యునరేషన్ భారీగా ఇవ్వాల్సిందే.. హీరోయిన్ డిమాండ్.. ఓకే చెప్పిన మేకర్స్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 27, 2021 | 1:36 PM

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో పూజాహెగ్డే ఒకరు. ఇప్పటీకే ప్రభాస్‏తో ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తుండగా.. అటు అక్కినేని అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో కూడా నటిస్తుంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా ఇందులో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్‏కు జోడీగా పూజా నటించనున్నట్లుగా సమాచారం.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి పూజాను సంప్రదించారట మేకర్స్. అయితే ఇందుకు పూజా హెగ్డే ఓ కండిషన్ పెట్టినట్లుగా సమాచారం. ఈ మూవీలో చేయాలంటే తనకు ఫూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తేనే నటిస్తానని కండిషన్ చెప్పిందట. ఇక ఆ షరతుకు మేకర్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంటే ప్రస్తుతం పూజా హెగ్డే సినిమాలో నటిస్తే ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో.. ఆచార్య సినిమాలోని చిన్న పాత్రకు అంతే పారితోషకం తీసుకుంటుందట.