AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ్టి నుంచి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం.. టార్గెట్ పెంచే దిశగా ఏర్పాట్లు..

తెలుగు రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీ ప్రక్రియ తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28న 400 కేంద్రాల్లో 37వేల మంది ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాలను అందించడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

ఇవాళ్టి నుంచి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం.. టార్గెట్ పెంచే దిశగా ఏర్పాట్లు..
Covid-19 vaccination
Sanjay Kasula
|

Updated on: Jan 28, 2021 | 8:01 AM

Share

Vaccinated for COVID-19 : తెలుగు రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీ ప్రక్రియ తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28న 400 కేంద్రాల్లో 37వేల మంది ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాలను అందించడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.

తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 1.55 లక్షల మంది టీకాలను పొందేందుకు కోవిన్‌ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చగా.. వీరిలో 42,915 మందికి సోమవారం టీకాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 20,359 మంది మాత్రమే టీకాలను పొందారు.

ఇవాళ్టి నుంచైనా లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరగా వ్యాక్సిన్ అందించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వారి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు.

అయితే.. 29న శుక్రవారం కూడా కోవిడ్‌ వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని తెలిపారు. మళ్లీ 30న శనివారం సార్వత్రిక టీకా పంపిణీలో భాగంగా కోవిడ్‌ టీకాలకు విరామం. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా ఈ నెల 31న పోలియో టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ తేదీన పోలియో టీకా పొందని చిన్నారుల కోసం.. ఆ తర్వాత వచ్చే నెల 1, 2 తేదీల్లోనూ పోలియో టీకాల పంపిణీ కొనసాగుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అంటే శుక్రవారం తర్వాత మళ్లీ వరుసగా 4 రోజుల పాటు కోవిడ్‌ టీకాల పంపిణీకి విరామం ఉంటుందని పేర్కొంది.

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు