బడికి పంపేందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు.. సోమవారం నుంచి తెరుచుకోనున్న తెలంగాణ స్కూళ్లు

తెలంగాణలో హైస్కూళ్లు తెరుచుకోనున్నాయి. తమ పిల్లల్ని బడికి పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు ఓకే చెప్పారు. మే 17న పదో తరగతి, మే 15లోపు ఇంటర్ పరీక్షలు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

  • Sanjay Kasula
  • Publish Date - 8:47 am, Thu, 28 January 21
బడికి పంపేందుకు ఓకే చెప్పిన తల్లిదండ్రులు.. సోమవారం నుంచి తెరుచుకోనున్న తెలంగాణ స్కూళ్లు

Schools To Reopen : తెలంగాణలో హైస్కూళ్లు తెరుచుకోనున్నాయి. తమ పిల్లల్ని బడికి పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు ఓకే చెప్పారు. ఈవిషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యాసంస్థల పునః ప్రారంభంపై మంత్రి సబితా ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

33 జిల్లాల DEOలతో సమీక్ష చేశారు. స్కూళ్లలో కొవిడ్‌ మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆ బాధ్యత జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీలదేనని చెప్పారామె. ప్రతి స్కూళ్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇప్పటివరకు 85 శాతం మంది డిజిటల్ క్లాసులు వింటున్నారని తెలిపారు. ప్రతి స్టూడెంట్‌కు తక్షణం పుస్తకాలు అందిస్తామన్నారు. మే 17న పదో తరగతి, మే 15లోపు ఇంటర్ పరీక్షలు పూర్తిచేస్తామని స్పష్టంచేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రతిరోజూ ప్రాక్టికల్స్‌ నిర్వహించాలని బోర్డు అధికారులను ఆదేశించారు మంత్రి సబిత. ఇంటర్‌ పరీక్ష ల వివరాలను వారంలో ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఏర్పాట్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ప్రాథమిక విద్యార్థులు చదువులకు దూరం కాకుండా ఉండేందుకు మొబైల్‌ లైబ్రరీలు అందుబాటులోకి తెచ్చారు.

ఇవి కూడా చదవండి :

ఇవాళ్టి నుంచి తెలంగాణలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం.. టార్గెట్ పెంచే దిశగా ఏర్పాట్లు..

బయో బబుల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లాండ్‌ జట్లు… అందరికంటే ముందే చెన్నై చేరుకున్న టీమిండియా సారథి