Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. సీఐడీ నోటీసులపై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని..

చంద్రబాబు పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. సీఐడీ నోటీసులపై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ అధినేత
Follow us
K Sammaiah

|

Updated on: Mar 19, 2021 | 11:02 AM

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని భూముల విషయంలో సీఐడీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం ఏపీ హైకోర్టులో ఆయన తరఫున న్యాయవాదులు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారించనుంది.

ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ నెల 16న సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెక్షన్‌ 41సీఆర్‌పీసీ కింద నోటీసులు అందజేసి, ఈ నెల 23న విజయవాడలోని కార్యాలయంలో విచారణకు రావాలని సూచించారు. అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి పీ నారాయణ సైతం ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. ఆయనకు సైతం బుధవారం సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22న విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఇదే విషయంలో విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌లోని నారాయణ విద్యాసంస్థలు, ఆఫీసుల, నివాసంలో సోదాలు నిర్వహించారు.

మోసం, కుట్రతో అసైన్డ్‌ భూములు లాక్కొన్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత 24న సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు, నారాయణపై ఎస్సీ, ఎస్టీ చట్టం సహా 10 సెక్షన్ల కింద సీఐడీ అధికారులు ఈ నెల 12న కేసు నమోదు చేశారు.

రాజధాని అసెంబ్లీ భూముల కుంభకోణంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఆర్ ను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైకోర్టులో సవాల్ చేశారు. ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత న్యాయసలహా తీసుకున్న అనంతరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 166, 167, 217, 120 (బీ) రెడ్‌ విత్‌ 34, 35, 36, 37, ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1), (ఎఫ్‌), (జీ), ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్న సీఐడీ.. మాజీ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణను ఏ2గా పేర్కొన్నారు. అలాగే కొంత మంది అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు పొందుపరిచింది.

ఈనెల 23న ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ రీజనల్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని చంద్రబాబుకు నోటీసులిచ్చిన అధికారులు.. విచారణకు హాజరుకాకపోయినా, విచారణలో వెల్లడించిన విషయాలతో సంతృప్తి చెందకపోయినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇదే కేసులో తన దగ్గరున్న ఆధారాలను సమర్పించాలని సీఐడీ.. ఎమ్మెల్యే ఆర్కేకు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరయ్యారు. సీఐడీ అధికారులకు ఆయన దగ్గరున్న ఆధారాలను అందించారు.

Read More:

నిన్నటి వరకు దినసరి కూలీలు.. నేడు కార్పొరేషన్లకు మేయర్లు.. ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళా ప్రభంజనం

‘పెద్దల మాట చద్దిమూట’ కవి ఆత్మహత్య.. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన మద్దా సత్యనారాయణ