పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ పై కొనసాగుతున్న సస్పెన్స్..! హైకోర్టులో వాదనలు.. తదుపరి విచారణ వాయిదా..

Parishad Elections : ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిషత్ ఎన్నికలు ముగిసినా కూడా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. చివరి నిమిషం వరకు అసలు

పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ పై కొనసాగుతున్న సస్పెన్స్..! హైకోర్టులో వాదనలు.. తదుపరి విచారణ వాయిదా..
Ap High Court
Follow us

|

Updated on: Apr 15, 2021 | 5:09 PM

AP MPTC ZPTC Elections : ఏపీలో తీవ్ర ఉత్కంఠ రేపిన పరిషత్ ఎన్నికలు ముగిసినా కూడా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. చివరి నిమిషం వరకు అసలు ఎన్నికలు ఉంటాయో ఉండవో తెలియక తీవ్ర ఉత్కంఠ రేపాయి. చివరికి హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో పోలింగ్ అయితే ముగిసింది. కానీ ఎస్‌ఈసీ ప్రకటించిన నోటిఫికేషన్‌ ప్రకారం ఈనెల 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. అయితే ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు ఇప్పటికే ఎస్‌ఈసీని ఆదేశించింది. సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం పరిష్కారం అయ్యేంత వరకు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన చేయవద్దని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఇవాళ పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీంతో కోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు టెన్షన్‌తో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులందరు ఆందోళనలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఘర్షణ వాతావరణం కనిపించింది. శ్రీకాకుళం నుంచి కడప జిల్లా వరకు అన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కొన్ని చోట్ల అభ్యర్థుల గుర్తులు గల్లంతయ్యాయి. కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. బీజేపీ ఏజెంట్ అయితే బ్యాలెట్ బాక్సును నీటిలో వేశాడు. ఏజెంట్లు లేక కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల అధికార పార్టీ అభ్యర్థుల వర్గీయులు రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై దాడులు చేశారు.

Superb Lyrebird: కోడి, నెమలి కలయిక ఈ పక్షి.. అనేక గొంతులను మిమిక్రీ చేయడమే ఈ పక్షి స్పెషల్. .ఎక్కడంటే..!

Corona cases: గల్లీ నుంచి ఢిల్లీ వరకు హాట్ స్పాట్ సెంటర్లు.. తెలంగాణలోని ఆ జల్లాలో పెరుగుతున్న కరోనా విలయతాండవం..

Reasons behind Visakha six murders : అప్పలరాజు కుటుంబంపై బాధిత బంధువుల ఆగ్రహావేశాలు, ఆరు హత్యల వెనుక కారణాలు..