రాహుల్‌తో చంద్రబాబు మంతనాలు..!
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పు, తదితర పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. అంతేగాక.. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిపై ఇరువురు నేతలకు అందిన నివేదికలపై కూడా చర్చించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, పార్టీల బలాబలాలు, తదుపరి భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో […]

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పు, తదితర పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. అంతేగాక.. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిపై ఇరువురు నేతలకు అందిన నివేదికలపై కూడా చర్చించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు పూర్తయిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహం, పార్టీల బలాబలాలు, తదుపరి భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం చంద్రబాబు నాయుడు కోల్‌కతా బయలుదేరి వెళ్లారు.