రైతుల పోరాటానికి అన్నా హజారే మద్దతు.. ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానన్న సామాజిక కార్యకర్త

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్న రైతులకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే..

రైతుల పోరాటానికి అన్నా హజారే మద్దతు.. ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహారదీక్షకు దిగుతానన్న సామాజిక కార్యకర్త
Follow us

|

Updated on: Jan 29, 2021 | 3:15 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్న రైతులకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మద్దతు ప్రకటించారు. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు అన్నా హజారే ప్రకటించారు.

తన సొంత పట్టణమైన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్ సిద్దిలో ఈ నెల 30 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్టు అన్నా హజారే తెలిపారు. గత నాలుగేళ్లుగా రైతుల సమస్యలపై తాను పోరాడుతున్నానని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు.

మూడు నెలలుగా ప్రధాని మోదీకి, కేంద్ర వ్యవసాయ మంత్రికి ఐదు సార్లు లేఖలు రాసినా స్పందించలేదని హజారే ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో ఢిల్లీలో తాను దీక్ష చేపడితే సమస్యలను పరిష్కరిస్తామని కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి మర్చిపోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాను నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నానని అన్నా హజారే తెలిపారు.

Farmers Protest: ఆందోళన విరమిస్తున్నాం.. కీలక ప్రకటన చేసిన భాతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు నరేశ్ తికాయత్..

Farmers protest: ఆ సమయంలో పోలీసులు ఎందుకు కాల్పులు జరపలేదు.. రైతు సంఘం నేత టికాయత్‌ ఘాటైన వ్యాఖ్యలు