Farmers protest: ఆ సమయంలో పోలీసులు ఎందుకు కాల్పులు జరపలేదు.. రైతు సంఘం నేత టికాయత్‌ ఘాటైన వ్యాఖ్యలు

ణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ఘాటైన వ్యాఖ్యలు..

Farmers protest:  ఆ సమయంలో పోలీసులు ఎందుకు కాల్పులు జరపలేదు.. రైతు సంఘం నేత టికాయత్‌ ఘాటైన వ్యాఖ్యలు
Farmers-Protest-Rakesh-Tikait
Follow us

|

Updated on: Jan 28, 2021 | 5:41 PM

Farmers protest – BKU Leader Rakesh Tikait: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 26న ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా ఎగురవేసిన దీప్ సిద్దూను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ టికాయత్ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. రైతుల ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు ఉద్దేశపూర్వకంగానే దీప్ సిద్దూని ట్రాక్టర్ ర్యాలీలోకి పంపించారంటూ ఆయన ఆరోపించారు. కొంత మంది ఎర్రకోటపైకి వెళ్లి జెండాను ఎలా ఎగురవేయగలిగారు..? ఆ సమయంలో ఎందుకు కాల్పులు జరగలేదు? అదే సమయంలో పోలీసులు ఎక్కడికి వెళ్లారు? అంతమందిలో సిద్దూ ఎలా వెళ్లగలిగాడు..? జెండా ఎగరవేసిన అనంతరం సిద్దూను పోలీసులు ఎందుకు పట్టుకోలేదు. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ టికాయత్‌ మండిపడ్డారు.

రైతులు నిరసన తెలుపుతున్న ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తే ఘాజీపూర్ సరిహద్దులోని స్థానిక పోలీస్‌ స్టేషన్లను ముట్టడిస్తామని టికాయత్‌ హెచ్చరించారు. అనంతరం జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. కావాలని కొంతమంది రైతు సంఘాలకు, పంజాబ్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు ఈ కుట్ర పన్నారని విమర్శించారు. కాగా.. రిపబ్లిక్‌ డే రోజు జరిగిన హింసకు రాకేశ్‌ టికాయత్‌ బాధ్యులని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు గురువారం ఘాజీపూర్‌ సరిహద్దులోని ఆయన గుడారం వద్ద నోటీసులు అంటించారు. దీనిపై ఆయన స్పందిస్తూ మూడు రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం చెబుతానని పేర్కొన్నారు.

Also Read:

రైతు చట్టాలకు మేమూ వ్యతిరేకం, తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ, బీజేపీ నిరసన

Protest Against Protest: ఢిల్లీలో మళ్లీ టెన్షన్‌.. రైతులు సింఘు బోర్డర్‌ను వీడాలంటూ స్థానికుల ఆందోళన