- Telugu News పొలిటికల్ ఫొటోలు Cm m k stalins surprise visit to dmdk chief vijayakanth residence sent political tongues wagging
CM Stalin – Vijayakanth: హీరో విజయకాంత్‌కు ఊహించని షాక్.. ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సీఎం
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం ఉదయం తమిళ నాయకుడు విజయ్ కాంత్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లో చురుకుగా లేని విజయకాంత్ ఆరోగ్యం గురించి స్టాలిన్ ఈ రోజు వ్యక్తిగతంగా విచారించారు.
Updated on: Jul 11, 2021 | 9:58 PM

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ రోజు తమిళ నాయకుడు,ఒకప్పటి స్టార్ హీరో విజయకాంత్‌ను కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ ఆకస్మిక కలయిక చాలా ప్రశ్నలను లేవనెత్తింది.

ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ఉదయం తమిళ నాయకుడు విజయ్ కాంత్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లో చురుకుగా లేని విజయకాంత్ ఆరోగ్యం గురించి స్టాలిన్ ఈ రోజు వ్యక్తిగతంగా విచారించారు.

అయితే ఆయన ఆరోగ్యం గురించి పరిశీలించడానికి వెళితే ఈ సమావేశంలో విజయకాండ్ కరోనా రిలీఫ్ ఫండ్ కోసం రూ .10 లక్షలను ముఖ్యమంత్రికి అందజేసి షాక్ ఇచ్చారు.

డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, ఎంపీ బిఈ రాసా కూడా సమావేశంలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను చూసిన విజయకాంత్, చేతులు గట్టిగా పట్టుకున్నాడు. విజయకాంత్ స్టాలిన్ పక్కన కూర్చుని అతని ఆరోగ్యం గురించి విచారించారు.




