- Telugu News Photo Gallery Worst Drinks For Weight Loss: These drinks to avoid when trying to lose weight
Drinks For Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ డ్రింక్స్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే
బరువు తగ్గాలంటే గంటల తరబడి కసరత్తులు చేయడం మాత్రమే కాదు.. తీసుకునే ఆహారంపై కూడ శ్రద్ధపెట్టాలి. ముఖ్యంగా ఆహారం అంటే తినే పదార్ధాలు మాత్రమే కాదు తాగే డ్రింక్స్ కూడా ఈ లిస్టులో చేర్చాలి. డ్రింక్స్ లో అధికమొత్తంలో క్యాలరీలు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపడంతోపాటు బరువు తగ్గకుండా అడ్డుకుంటాయి..
Updated on: Jan 08, 2025 | 3:28 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న లైఫ్‌స్టైల్ సమస్య అధిక బరువు. దీని నుంచి బయటపడాలంటే తక్కువ కేలరీల ఆహారాలు తినడం మాత్రమే కాదు తగిన వ్యాయామం కూడా చేయాలి. అయితే ఇందులో ఆహారం పాత్ర కీలకం. ఆహారంతోపాటు జీవనశైలి, భోజన సమయాలు, ఆహార పరిణామం, జీవక్రియ వంటి ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. బరువు తగ్గేక్రమంలో చాలా మంది డ్రింక్స్‌ను విస్మరిస్తుంటారు. ఇది తెలియకుండానే బరువు తగ్గే విధానాన్ని అడ్డుకుంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ఈ కింది పానీయాలను అస్సలు ముట్టుకోకూడదు.

బరువు తగ్గడానికి ప్రయత్నించేటప్పుడు పండ్ల రసాలు అస్సలు తాగకూడదు. పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు. పూర్తి కేలరీలు, చక్కెర ఉంటాయి. అందువల్ల ద్రవాలకు పండును యథాతథంగా తినడం మంచిది.

కార్బోనేటేడ్ పానీయాలు పోషకాహారం లేనివి. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో సోడా ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

ఆల్కహాల్ పానీయా తక్కువ పోషకాలు, ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. దీనితో పాటు, చిప్స్ ఇతర రుచికరమైన స్నాక్స్ తీసుకోవడం వల్ల మొత్తం కేలరీల సంఖ్య పెరుగుతుంది.

అలాగే టీ, కాఫీ వంటి కెఫీన్ అధికంగా ఉండే పానియాలకు దూరంగా ఉండాలి. వీటిల్లో అధిక మోతాదులో కెఫీన్‌తోపాటు ఇతర ఉద్దీపనలు హృదయ స్పందన రేటు, రక్తపోటును పెంచుతాయి. ఎనర్జీ డ్రింక్స్ కూడా చక్కెర, అనవసరమైన కేలరీలతో నిండి ఉంటాయి.




