అంతరిక్ష పర్యటనలో మరో ముందడుగు.. ఇక పై స్పేస్ టూర్ సులభమే.. ఎంత డబ్బు చెల్లించాలంటే..

ఇప్పటివరకు వేరే ప్రదేశాలకు టూర్ వెళ్లడం మాత్రమే చూసాము.. ఇక అంతరిక్షంపైకి వెళ్లాలంటే శాస్త్రవేత్తలకు మాత్రమే సాధ్యం. కానీ ఇక పై సాధారణ ప్రజలు కూడా స్పేస్ పై టూర్ వెళ్లోచు.

1/7
 ప్రపంచవ్యా్ప్తంగా అంతరిక్ష పర్యాటకం  ప్రారంభమైంది. స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్ , వర్జిన్ గెలాక్టిక్ వంటి సంస్థలు అంతరిక్ష పర్యటనకు అవకాశం కల్పిస్తున్నాయి.  ఒక స్పేస్ టూరిజం కంపెనీ 2024 నాటికి ప్రజలను బెలూన్ ద్వారా స్ట్రాటో ఆవరణానికి పంపనున్నట్లుగా తెలిపింది. కానీ అందులో ఒక సీటు ఖరీదు 36,700 పౌండ్లు (దాదాపు రూ. 36.7 లక్షలు).

2/7
 వరల్డ్ వ్యూ ఎంటర్‌ప్రైజెస్ అమెరికాలోని అరిజోనాలో బెలూన్ ఆధారిత వ్యవస్థపై పనిచేస్తోంది. ఇది ప్రజలను ఉపరితలం నుండి 18 మైళ్ల ఎత్తుకు తీసుకెళుతుందని సదరు కంపెనీ తెలిపింది. అలాగే ఇది నాసా అంతరిక్షంగా భావించే 50 మైళ్ల ఎత్తు నుంచి కొంత దూరంలో ఉంటుంది.

3/7
స్పేస్‌కు ప్రయాణించడం దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. అయితే ఈ పర్యటనను ఐదు రోజుల పాటు కొనసాగించడానికి కంపెనీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రదేశంలో పర్యాటకులు చారిత్రక ప్రదేశాల మీది నుంచి వెళ్తారు. ఇందులో గ్రేట్ బారియర్ రీఫ్, పిజామిడ్ ఆఫ్ గిజా, ఇతర ముఖ్యమైన సైట్‌లు ఉంటాయి.

4/7
స్ట్రాటో ఆవరణానికి ప్రయాణీకులను తీసుకెళ్లే ప్రతి క్యాప్సూల్ ఎనిమిది మందిని తీసుకెళ్తుంది. అన్ని వయసుల వారు అంతరిక్ష పర్యటనకు వెళ్లవచ్చని కంపెనీ తెలిపింది. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ వంటి ఇతర స్పేస్ టూరిజం ఎంపికల ద్వారా ప్రయాణం కంటే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.

5/7
కంపెనీ సీఈఓ, ర్యాన్ హార్ట్మన్, స్పేస్ టూరిజం ప్రస్తుతం పరిస్థితిని మార్చడమన్నారు. బెలూన్ లాంటి క్యాప్సూల్‌లో గంటలు గడపడం ద్వారా స్పేస్ టూరిజాన్ని పునర్నిర్వచించామని చెప్పుకొచ్చారు.

6/7
వరల్డ్ వ్యూ ఇటీవలి కాలంలో బెలూన్ల ద్వారా స్ట్రాటో ఆవరణానికి శాస్త్రీయ పేలోడ్‌లను పంపడంపై దృష్టి సారించింది. కానీ ఇప్పుడు అది ప్రజలను అంతరిక్షంలోకి తరలించడానికి ఒక ప్రణాళికను ప్రారంభించింది. 2024 నాటికి నిర్వహించే మొదటి విమానం మొత్తం టిక్కెట్లను లాభాపేక్షలేని సంస్థ స్పేస్ ఫర్ హ్యుమానిటీకి కంపెనీ విక్రయించింది.

7/7
గ్రాండ్ కాన్యన్ సమీపంలోని అరిజోనాలోని పేజ్ నుండి మొదటి విమానాలు ప్రారంభమవుతాయి. అయితే భవిష్యత్తులో ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్‌లు, ఇతర సైట్‌లను ప్రారంభ సైట్‌ల జాబితాలో చేర్చాలని వారు భావిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu