- Telugu News Photo Gallery World photos Facts albert einstein studied roswell crash ufo and corpses of five aliens claims assistant dr shirley wright teps
అమెరికాలోని రోస్వెల్లో అంతుచిక్కని ప్రమాదం.. ఏలియన్స్ మృతదేహాల గురించి షాకింగ్ విషయాలను చెప్పిన ఐన్స్టీన్ అసిస్టెంట్…
ఇప్పటికీ ఏలియన్స్ గురించిన వాస్తవాలు మాత్రం అంతుచిక్కడం లేదు. ఏలియన్స్ ఉనికిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ మాజీ సహోద్యోగి డాక్టర్ షిర్లీ రైట్ ఏలియన్స్ అధ్యాయనాలు చేశాడు.
Updated on: Oct 12, 2021 | 1:38 PM

న్యూమెక్సికో.. అమెరికాలో ఉన్న రోస్వెల్.. ఇక్కడ.. విదేశీయుల ఓడ లేదా UFO ఢీకొన్నాయని అంటుంటారు. ఇక్కడ క్రాష్ అయిన UFOను ఆల్బర్ట్ ఐన్స్టీన్ పరీక్షించారని.. అక్కడ ఏలియన్స్ మృతదేహాలకు శవపరీక్ష కూడా చేశారని ఐన్స్టీన్ మాజీ అసిస్టెంట్ తెలిపారు.

డాక్టర్ షెర్లీ రైట్.. ఆమె ఐన్స్టీన్ తో కలిసి న్యూమెక్సికో ఎడారికి అత్యంత రహస్య పర్యటనలో పాల్గోన్నారని చెప్పారు.. డాక్టర్ షెర్లీ రైట్.. 2015లో మరణించింది. కానీ ఆమె మరణించడానికి ముందు కొన్ని టేప్ రికార్టింగ్స్ చేసింది.. అందులో ఆమె ప్రయాణాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు ఆ రికార్డింగ్స్ పబ్లిక్ చేశారు.

ఏలియన్స్ ఓడ ఒకవైపు దెబ్బతిన్నదని ఆమె చెప్పారు. అది డిస్క్ ఆకారంలో ఉందని.. దాని పరిమాణం ఒక అంతస్తుకు సమానమని చెప్పుకొచ్చారు. ఆ ఓడ శరీరం ప్రతిబింబించే పదార్థం లాంటిది..కానీ దగ్గరగా వచ్చినప్పుడు అందులో మార్పులు లేవన్నారు. ఆ మెటీరియల్ గురించి తెలియదన్నారు.

ఆ ఓడ 1947లో కూలిపోయిందని సమాచారం. ఈ స్పేస్ షిప్ చుట్టూ గార్డ్లు.. ఫోటో గ్రాఫర్లు... నిపుణులు అధ్యాయనం చేస్తున్నారని ఆమె చెప్పారు. ఐన్స్టీన్ UFOల ప్రొపల్షన్ సిస్టమ్ ను అధ్యాయనం చేశాడని.. అందులో అసలు నిజాలు చూసి ఐన్స్టీన్ తన చూపును తిప్పుకోలేకపోయాడని తెలిపింది.

ఐన్స్టీన్ పరిశీలన ప్రారంభంలో తను నోట్స్ రికార్డ్ చేయలేదని తెలిపారు. ఏలియన్స్ భూమి పైకి ఎందుకు వచ్చాయనేది మాత్రం ఐన్స్టీన్ తెలియదని చెప్పాడని.. కానీ.. ఈ ప్రమాదం వలన భూమి, విశ్వం గురించి మరింత నేర్చుకోగలమని ఐన్స్టీన్ అన్నారని చెప్పుకొచ్చింది. ఒకరితో ఒకరు పరిచయం చేసుకోవడం వలన రెండు ప్రపంచాలకు ప్రయోజనం ఉంటుందని ఐన్స్టీన్ చెప్పారు.

డాక్టర్ షెర్లీ రైట్ ఐదు ఏలియన్స్ మృతదేహాలను చూసినట్లుగా చెప్పుకొచ్చింది. మృతదేహాలను దగ్గరగా చూడటానికి కేవలం కొందరు నిపుణులకు మాత్రమే అనుమతి ఉంది. అందులో ఐన్స్టీన్ ఒకరు.

ఆ ఐదుగురు ఒకేలా ఉన్నారని.. దాదాపు 5 అడుగుల ఎత్తు ఉన్నారని.. వాటికి తలపై జుట్టు లేదని.. అలాగే తల కూడా చాలా పెద్దగా ఉండి.. కళ్లు లోతుగా ఉన్నాయని.. వారి శరీర రంగు పచ్చగా ఉందని ఐన్స్టీన్ తనతో చెప్పారని డాక్టర్ షెర్లీ రైట్ చెప్పారు.
