- Telugu News Photo Gallery Winter Skin Care: Skin Care Things To Use This Winter To Protect Your Skin From Drying
Winter Skin Care: చలికాలంలో మీ ముఖ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఉత్పత్తులు ఇవే..
సీజన్ మారినప్పుడు, దానితోపాటు జీవనశైలి కూడా మారుతుంది. చలికాలం వచ్చిందంటే శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఉన్ని బట్టలు ధరించాల్సిందే. అలాగే ఆహారం మారుతుంది. ఇక చలికాలం అంటే పొడి చర్మం, పగిలిన పెదవులు, మడమలు పగుళ్లు సర్వసాధారణం. స్నానానికి ముందు నూనె రాసుకోకపోతే, స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. శీతాకాలపు చర్మ సంరక్షణకు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అలాగే చర్మానికి తేమను..
Updated on: Dec 01, 2023 | 12:18 PM

సీజన్ మారినప్పుడు, దానితోపాటు జీవనశైలి కూడా మారుతుంది. చలికాలం వచ్చిందంటే శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఉన్ని బట్టలు ధరించాల్సిందే. అలాగే ఆహారం మారుతుంది. ఇక చలికాలం అంటే పొడి చర్మం, పగిలిన పెదవులు, మడమలు పగుళ్లు సర్వసాధారణం. స్నానానికి ముందు నూనె రాసుకోకపోతే, స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

శీతాకాలపు చర్మ సంరక్షణకు ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. అలాగే చర్మానికి తేమను అందించే ఉత్పత్తులను వాడాలి. చర్మాన్ని తేమగా ఉంచే సౌందర్య ఉత్పత్తులు కొన్నింటిని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే.. చలికాలమైనా, వర్షాకాలమైనా, ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అయితే చలికాలం మాత్రం హైడ్రేటింగ్ క్లెన్సర్ రాసుకోవడం ఉత్తమం. హైడ్రేటింగ్ క్లెన్సర్ చర్మాన్ని దాని సహజ నూనెలను కొల్పోకుండా చేసి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ లేదా సిరామైడ్ కలిగి ఉన్న హైడ్రేటింగ్ క్లెన్సర్‌ను మాత్రమే ఎల్లప్పుడు ఎంచుకోవాలి.

ఏడాది పొడవునా ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. షియా బటర్, ఆర్గాన్ లేదా జోజోబా ఆయిల్ ఉన్న మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.

చలికాలం అయినా సరే సన్‌స్క్రీన్ తప్పక రాసుకోవాలి. గ్లిజరిన్, పెట్రోలియం జెల్లీ ఉన్న లిప్ బామ్‌ను పగిలిన పెదాలకు వినియోగించాలి. పాదాలు మృదువుగా ఉండటానికి ఫుట్ క్రీమ్ ఉపయోగించాలి.

పొడి చర్మం వల్ల మృతకణాలు పేరుకుపోతాయి. ఇది చర్మం డల్‌గా కనిపించేలా చేస్తుంది. తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్ ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. లాక్టిక్ యాసిడ్ లేదా ఫ్రూట్ ఎంజైమ్‌లు కలిగి ఉన్న ఎక్స్‌ఫోలియేటర్లు శీతాకాలంలో బాగా పనిచేస్తాయి. అలాగే సాలిసిలిక్ యాసిడ్ వంటి పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు.




