స్వీట్లు తిన్న వెంటనే కాఫీ, టీ తాగితే ఎందుకు చేదుగా అనిపిస్తుందో తెల్సా? అసలు సీక్రెట్ ఇదే..
స్వీట్లు, ఐస్ క్రీం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగితే ఎందుకు చేదుగా అనిపిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? రెండింటిలోనూ చక్కెర ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. నిజానికి టీ అయినా, కాఫీ అయినా రెండింటిలోనూ చక్కెర ఉన్నప్పటికీ..
Updated on: Aug 25, 2025 | 1:49 PM

స్వీట్లు, ఐస్ క్రీం తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగితే ఎందుకు చేదుగా అనిపిస్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? రెండింటిలోనూ చక్కెర ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందో, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

స్వీట్లు లేదా ఇతర తీపి పదార్థాలు తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగినప్పుడు రుచి తెలియదు. టీ అయినా, కాఫీ అయినా రెండింటిలోనూ చక్కెర ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుందంటే.. తీపి తిన్న తర్వాత టీ లేదా కాఫీ చేదుగా అనిపించడానికి మానవ మెదడే కారణం. మన శరీరంలోని నాలుక వంటి ఇంద్రియ అవయవాలు మెదడు నుంచి సమాచారాన్ని స్వీకరించి ఆదేశాలు ఇస్తాయి. దీని ఆధారంగా శరీరం పనిచేస్తుంది. తీపి తినడం విషయంలో కూడా అదే జరుగుతుంది.

మెదడు స్థిరమైన సంకేతానికి అలవాటు పడినప్పుడు, అది దానిని విస్మరించి ఇతర మరింత స్పష్టమైన మార్పులపై దృష్టి పెడుతుంది. అందుకే అధికంగా తియ్యగా ఉండే పదార్ధాలు తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగినప్పుడు అది అంత తీపిగా రుచించదు. దీంతో మెడదు చేదు రుచి సంకేతాన్ని నాలుకకు పంపుతుంది.

రోజు మొత్తంలో అధికంగా ఇలా తీపి పదార్థాలను తింటుంటే.. తీపి పదార్థాలకు నాలుక అలవాటు పడుతుంది. దీంతో మెదడు తేడాను గమనించదు. కానీ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఏదైనా చేస్తే.. అంటే నారింజ తినడం వంటివి చేస్తే మెదడు రుచి మారినట్లు గ్రహించి వెంటనే దానిని పుల్లగా నివేదిస్తుంది.

ఇంద్రియాలకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత మెదడు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుందని సైన్స్ చెబుతోంది. అందుకే స్వీట్స్ తిన్న కొంత సమయం తర్వాత టీ తాగితే అది తీపి రుచిని కలిగి ఉన్నట్లు మెదడు సంకేతాలు పంపుతుంది. రుచి మెదడును ఈ విధంగా ప్రభావితం చేస్తుంది.




