Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు.. గేదె పాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివనే సందేహం మీకూ ఉందా?
దాదాపు అందరూ ప్రతి ఉదయం పాలతో తమ రోజును ప్రారంభిస్తారు. కాఫీ, టీ లేదంటే గ్లాసుడు పాలు తాగందే చాలా మందికి రోజు ప్రారంభంకాదు. అయితే కొంతమంది ఆవు పాలు తాగితే.. మరికొందరు గేదె పాలు తాగుతారు. అయితే ఏ పాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయో అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంది..
Updated on: Aug 25, 2025 | 1:34 PM

దాదాపు అందరూ ప్రతి ఉదయం పాలతో తమ రోజును ప్రారంభిస్తారు. కాఫీ, టీ లేదంటే గ్లాసుడు పాలు తాగందే చాలా మందికి రోజు ప్రారంభంకాదు. అయితే కొంతమంది ఆవు పాలు తాగితే.. మరికొందరు గేదె పాలు తాగుతారు. అయితే ఏ పాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయో అనే విషయంలో చాలా మందికి సందేహం ఉంది.

సాధారణంగా ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాలు తాగుతారు. పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. పాల ద్వారా అనేక వ్యాధులు శాశ్వతంగా నయమవుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఆవు పాలు లేదా గేదె పాలు ఏవి మంచివి అనే విషయం నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా ఆవు పాలు చాలా సులువుగా జీర్ణం అవుతాయి. అయితే ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం గేదె పాలను తీసుకోవడం మంచిది.

ఆవు పాల కంటే గేదె పాలలో ఎక్కువ ఖనిజాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాలు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

అయితే గేదె పాలు అయినా.. ఆవు పాలు అయినా.. మన శరీరానికి దాని నుండి అనేక పోషకాలు లభిస్తాయి. అందువల్ల రెండు పాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నవారు ఈ రెండింటినీ హాయిగా తీసుకోవచ్చు.




