AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మి వ్రతానికి ఏ నైవేద్యాలు చేయాలని ఆలోచిస్తున్నారా..? సులభమైన, సంప్రదాయ వంటకాల లిస్ట్ ఇదిగో మీకోసమే..!

వారలక్ష్మీ వ్రతం రోజున భక్తులు లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తారు. ఈ పండుగ రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టే వంటకాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. రుచి, ఆరోగ్యం, సంప్రదాయం కలగలిపి ఉండే ఈ వంటకాలను తయారు చేయడం ఒక కళ. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి సమర్పించడానికి వీలుగా.. మన సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న కొన్ని ప్రత్యేక వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వంటకాలు కేవలం నైవేద్యాలు మాత్రమే కాదు.. పండుగ వాతావరణాన్ని మరింత ఆనందంగా మార్చేవి కూడా.

Prashanthi V
|

Updated on: Aug 06, 2025 | 7:32 PM

Share
చక్కెర పొంగలి.. పండుగల సమయంలో దక్షిణ భారతదేశంలో తయారు చేసే ఓ స్పెషల్ స్వీట్ ఇది. పచ్చి బియ్యం, పెసరపప్పుతో పాటు బెల్లం లేదా చక్కెర కలిపి నెయ్యి, యాలకుల పొడితో ఈ తీపి వంటకాన్ని ఎంతో రుచికరంగా చేస్తారు. తెలుగులో దీనిని చక్కెర పొంగలి అంటారు.

1 / 8
బెల్లం పరమాన్నం.. బియ్యం, పాలు, బెల్లంతో తయారయ్యే ఈ సంప్రదాయ స్వీట్ తెలుగు ప్రజల ఇళ్ళలో తరచుగా కనిపిస్తుంది. దీనిని బెల్లం పరమాన్నం లేదా క్షీరాన్నం అని కూడా అంటారు. ఈ పరమాన్నంలో యాలకుల పొడి కలిపి దేవుడికి నైవేద్యంగా పెడుతారు.

2 / 8
పెరుగు అన్నం.. శరీరాన్ని చల్లగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి పెరుగు అన్నం చాలా మంచిది. దీనిని ఉప్పు, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వంటి పోపులతో తయారు చేస్తారు. ఊరగాయలు, అప్పడాలు లేదా కూరగాయల సలాడ్‌తో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

3 / 8
పులిహోర.. పులిహోర చాలా ప్రసిద్ధి చెందిన వంటకం. ఇది చింతపండు పులుసు, పప్పులు, పసుపు, కరివేపాకు వంటి వాటితో కలిపి తయారు చేస్తారు. పండుగలప్పుడు, శుభకార్యాలలో ఇది తప్పనిసరిగా ఉండాల్సిన ప్రసాదం.

4 / 8
సున్నుండలు.. ఉలవ పప్పు, బెల్లం, నెయ్యితో చేసే సున్నుండలు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో ఉండే ప్రొటీన్లు, మంచి కొవ్వులు శరీరానికి శక్తినిస్తాయి. పండుగలప్పుడు, శుభకార్యాలలో వీటిని తయారు చేయడం ఆనవాయితీ.

5 / 8
పప్పు వడలు.. ఇది పప్పులతో చేసే ఒక సంప్రదాయ స్నాక్. పప్పులను నానబెట్టి, మసాలా దినుసులు, కరివేపాకు వేసి వడలు తయారు చేస్తారు. కొబ్బరి చట్నీ లేదా కొత్తిమీర చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.

6 / 8
కొబ్బరి లడ్డూ.. కొబ్బరి తురుము, బెల్లం లేదా పంచదారతో చేసే ఈ లడ్డూలు చాలా రుచికరంగా ఉంటాయి. వీటిలో బాదం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కలిపి తయారు చేస్తే మరింత రుచిగా ఉంటాయి. పండుగలకు తప్పకుండా వీటిని తయారు చేస్తారు.

7 / 8
పూర్ణం కుడుములు.. బియ్యం పిండితో చేసి లోపల బెల్లం, కొబ్బరి తురుముతో తయారు చేసే పూర్ణం పెట్టి ఈ స్వీట్‌ను చేస్తారు. ఈ కుడుములను ముఖ్యంగా వినాయకుడికి, అమ్మవారికి నైవేద్యంగా పెడుతారు. ఈ పది రకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన సాంప్రదాయ వంటకాలను వారలక్ష్మీ వ్రతం రోజున తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించండి. ఈ పవిత్రమైన రోజుని భక్తి, ఆనందంతో జరుపుకోండి.

8 / 8
కండోమ్ లేకుండా శృంగారంతో జైలుకు.. ఆ 'ఆటగాడు' ఎవరంటే?

అర్ధరాత్రి ఆకలి అవుతుందా.. మీరు చేసే ఈ తప్పులే కారణమని తెలుసా..?

హైదరాబాద్‌కి మెస్సీ ఫీవర్‌.. ఫొటో దిగాలంటే రూ. 10 లక్షల టికెట్‌..

శేష వస్త్రాల కొనుగోలులో.. సశేష ప్రశ్నలెన్నో స్కామ్..

14 ఏళ్ల తర్వాత భారత్‌కు మెస్సీ.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కు రెడీ

డయాబెటిస్‌ వారికి శుభవార్త.. నోవో నార్డిస్క్ మందు వచ్చేసింది!

మీ దంతాలు తెల్లటి ముత్యాల్లా మెరవాలంటే..ఈ 3 పదార్థాలు ఉంటే చాలు

మెరుపు వేగంతో దూసుకెళ్లే బుడ్డి కారు..! ధర, ఫీచర్లు ఇవే..

దీన స్థితిలో టాలీవుడ్ ప్రముఖ నటి.. వృద్ధాశ్రమంలో ఆశ్రయం

ఇంకా ఎంత పెరుగుతుందో..? తులంపై రూ.3 వేలకుపైగా పెరిగిన బంగారం ధర