గుడ్డు ఇలా తిన్నారంటే.. కొంప కొల్లేరే! కాస్త చూస్కోండి..
ఆరోగ్యానికి గుడ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో విటమిన్లు ఎ, బి, బి12, డి, ఇ పుష్కలంగా ఉంటాయి. అందుకే వైద్యులు గుడ్లు తినమని ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటారు. చిన్న పిల్లలు కూడా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. కానీ గుడ్లు తినే విధానంపై దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి..
Updated on: Oct 27, 2025 | 9:18 PM

ఒక గుడ్డులో సాధారణంగా 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందులో సగం తెలుపు, సగం పచ్చసొన ఉంటాయి. అయితే ఈ పచ్చసొనలో దాదాపు 180-200 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల చాలా మంది పచ్చ సొన తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు.

Eggs

గుడ్లను పోషకాహారానికి సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అవి శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కొవ్వు ఉండదు. పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, B12, అలాగే ఇనుము, జింక్, భాస్వరం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.

ఊబకాయంతో బాధపడుతున్న వారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తరచూ గుడ్డు తినటం వల్ల ఇది మరింత బరువును పెంచుతుంది. అలాగే, డయాబెటీస్‌తో బాధపడుతున్నవారు కూడా సాధ్యమైనంత తక్కువ మోతాదులోనే గుడ్లు తీసుకోవాలని చెబుతున్నారు.

మీ కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉంటే రోజుకు ఒక గుడ్డు, దానిలోని పచ్చసొన తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. అయితే మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం గుడ్డులోని తెల్లసొన తీసుకోకపోవడం మంచిది.




