Pressure cooker: ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన..
ఇటీవల కాలంలో చాలామంది అన్నాన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లోనే వండుతున్నారు. పట్టణాల్లో మాత్రమే కాదు పల్లెలకు కూడా ఈ అలవాటు పాకిపోయింది. సులువైన పద్ధతి కావడంతో ఎక్కువ మంది ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. అయితే, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తింటే అనేక అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు. అయితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో వండిన అన్నం అలవాటుగా తింటూ ఉంటే.. చివరకు ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Oct 07, 2024 | 6:50 PM

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల చిన్న వయసులోనే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండినటువంటి అన్నంలో పోషకాలు మాయమవుతాయని, వంట చేసే సమయంలో అందులోనుండి ప్రమాదకరమైన కెమికల్స్ విడుదలవుతాయని చెబుతున్నారు.

ఇక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తిన్న వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కంటే ప్రెషర్ కుక్కర్ ఎంతో మేలని చెబుతున్నారు. ఒకవేళ అన్నం త్వరగా వండాలి అంటే ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

కరెంట్ ఆధారంగా ఉడికినటువంటి అన్నాన్ని తినకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రలు, స్టీలు పాత్రలలో వండుకుని తినడం మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రలో వండుకుని తినడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచినిస్తాయని చెబుతున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తయారీలో ఎక్కువగా అల్యూమినియం వాడుతుంటారు.. ఇందులో చేసిన ఆహారాలను తీసుకోవటం వల్ల ఉదర సంబంద సమస్యలు, గుండె సంబందిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. . కాబట్టి ప్రెషర్ కుక్కర్ లేదా కరెంట్ కుక్కర్ లో వండటం సాధ్యమైనంత వరకు మానేయటమే ఉత్తమంగా చెబుతున్నారు.

ఎక్కువ ప్రెషర్‌లో అన్నం వండటంవల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర శిలీంధ్రాలు, బ్యాక్టీరియా నాశనమైపోతాయి. పొయ్యి మీది వంటతో పోల్చితే ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వేగంగా సిద్ధమవుతుంది.




