- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 1st T20I Suryakumar Yadav Created These Two Special Record Telugua News
IND vs BAN: బంగ్లాపై డబుల్ బాదేసిన ‘సూర్య’.. స్పెషల్ లిస్టులో టీమిండియా టీ20 స్పెషల్ లిస్ట్
IND vs BAN 1st T20I Suryakumar Yadav Records: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో 14 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు తన పేరిట రెండు ప్రత్యేక రికార్డులను రూపొందించాడు.
Updated on: Oct 07, 2024 | 10:09 PM

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

తన తుఫాన్ ఇన్నింగ్స్‌లో 14 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 2 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో పాటు తన పేరిట రెండు ప్రత్యేక రికార్డులను రూపొందించాడు.

బంగ్లాదేశ్‌పై 29 పరుగులతో ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో గతంలో 18వ స్థానంలో ఉన్న సూర్య ఇప్పుడు మూడు స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.

అంతేకాకుండా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మూడు భారీ సిక్సర్లు బాదిన సూర్య టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. సూర్య ఇప్పటివరకు టీ20లో మొత్తం 139 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఇప్పటివరకు 205 సిక్సర్లు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరపున అర్షదీప్, వరుణ్ చెరో 3 వికెట్లు తీశారు.

బంగ్లాదేశ్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. హార్దిక్ పాండ్యా 39 పరుగులతో జట్టు అత్యధిక ఇన్నింగ్స్ ఆడగా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్ కూడా 29 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.




