Wayanad landslide: మాకు రాత్రంతా ఏనుగులే రక్షణ.. మనవరాలితో పర్వతం మీదకు చేరుకున్న మహిళ ఏం చెప్పిందంటే
భారత దేశ చరిత్ర పుటల్లో అత్యంత విషాదకర ఘటనలలో ఒకటిగా నిలిచిపోతుంది జూలై 30వ తేదీ.. కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడిన దుర్ఘటనలో అర్ధరాత్రి నిద్రలో ఉండగానే వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుని పోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ సంఘటన జరిగి వారం రోజులు అవుతున్నా ఇంకా జాడ తెలియని వ్యక్తులు ఎందరో ఉన్నారు. భారత ఆర్మీ, రెస్క్యు సిబ్బంది, జాగిలాలతో సహా అనేక మంచి శిధిలాల కింద మానవుల జాడ కోసం జల్లెడ పడుతున్నారు. అయితే అక్కడక్కడ ఇంటి శిధిలాలకిందనో చెట్టు పుట్టల చాటునో ప్రాణాలను కాపాడుకుని గాయపడిన వ్యక్తులు బయటపడుతున్నారు. తాజాగా వయనాడలో దుర్ఘటన నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి పోరాడిన మహిళకు ఏనుగు ఇచ్చిన మద్దతుకు సంబంధించిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది. ఈ విషయం విన్న వారి హృదయం ద్రవిస్తుంది. ఎందుకంటే ఆ మహిళ దుస్తితి చూసి ఏనుగు కంట కన్నీరు పెట్టిందట. వివరాల్లోకి వెళ్తే..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




