- Telugu News Photo Gallery Viral photos Haryana to avoid violence farmers in sonipat use bulletproof tractors
Photo Gallery: ట్రాక్టర్‌ను ఈ రైతు బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చేశాడు.. కారణం చాలా పెద్దదేనండోయ్.. ఇవిగో వివరాలు
దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ట్రాక్టర్‌ను బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చాడు....
Updated on: Mar 18, 2021 | 2:43 PM

హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఈ రైతు నివసిస్తాడు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా ఘర్షణలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆ రైతు కొత్తగా ఆలోచించాడు. తన ట్రాక్టర్‌ను బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చాశాడు.

ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా మధ్య ఎప్పటి నుంచో జలవివాదం కొనసాగుతోంది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశారనని రైతు రాజేంద్ర చెప్పాడు.

ఈ సమస్య నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించాను. ఇప్పుడు మా ప్రాంతంలోని రైతులు ఇదే విధానాన్ని అనుసరించాలని భావిస్తుున్నారని సదరు రైతు వెల్లడించాడు.

గత వారం నేను నా సోదరుడితో పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మాపై దాడి చేశారు. కాల్పులు కూడా జరిపారు. ఆ సమయంలో ఈ ట్రాక్టర్ కారణంగా మేము సురక్షితంగా బయటపడ్డామని సదరు రైతు చెప్పాడు

ఏది.. ఏమైనా ఈ ఆలోచన కాస్త వినూత్నమైనదో అయినా.. ఖర్చుతో కూడుకుంది కూడా. పెద్ద, పెద్ద రైతులు భరించగలరు కానీ.. చిన్న, సన్నకారు, కౌలు రైతులు మాత్రం ఈ విధానాన్ని అనుసరించడం కష్టం. ఈ మోడల్ చేయించడానికి రూ. 5 లక్షల ఖర్చు అయ్యిందట





























