- Telugu News Photo Gallery Uttarakhand best time to visit valley of flowers and how to reach there know the details
ప్రకృతి గీచిన చిత్రం.. ఈ పువ్వుల లోయ.. ఒకేసారి బ్రహ్మకమలం సహా 500 పువ్వులను చూడవచ్చు.. ఎక్కడ ఉందంటే..
ఉత్తరాఖండ్ దేవతల నివాసం అని అంటారు. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాల కలయికతో మీరు ప్రతి సీజన్‌లో సందర్శించగల ప్రదేశం. మీరు వేసవిలో ఇక్కడికి వెళ్లి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు, శీతాకాలంలో మంచును కూడా చూడవచ్చు. ఉత్తరాఖండ్‌లో అడగుడగునా అందాలతో కనువిందు చేసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడకి ఒకసారి వెళ్తే.. మళ్ళీ ఎప్పటికీ తిరిగి వెళ్లాలని అనుకోరు. అటువంటి అందమైన ప్రదేశంలో ఒకటి పువ్వుల లోయ.
Updated on: Aug 07, 2025 | 5:12 PM

ఉత్తరాఖండ్ దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎత్తైన పర్వతాలు అడుగడుగునా పచ్చదనాన్ని చూడవచ్చు. అయితే ఉత్తరాఖండ్ లోని ఒక ప్రదేశం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ ఉన్న పువ్వుల లోయ సంవత్సరంలో 5 నెలలు మాత్రమే కనిపించే పర్యాటకులు వెళ్లేందుకు వీలైన ప్రదేశం.

అవును నిజానికి పూల లోయ ఏడాదిలో జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే పర్యాటకులకు తెరిచి ఉంటుంది. ఈ లోయ అందమైన పువ్వులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు 500 కంటే ఎక్కువ రకాల పువ్వులను చూడవచ్చు, అవి చుపరుల మనసును దోచుకుంటాయి.

ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్‌లో ఉన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నందా దేవి బయోస్పియర్ రిజర్వ్‌లో ఒక భాగం. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ దాదాపు 87.5 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. దీని పొడవు దాదాపు 8 కిలోమీటర్లు, వెడల్పు 2 కిలోమీటర్లు.

ఈ పువ్వుల లోయ పేరు ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా చేర్చబడింది. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం అయిన బ్రహ్మ కమల పుష్పాన్ని కూడా చూడవచ్చు. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు.

ఢిల్లీ నుంచి పువ్వుల లోయకు వెళుతుంటే.. దాని దూరం దాదాపు 500 కిలోమీటర్లు. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటలు పడుతుంది. సొంత సఫారీలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా ఢిల్లీ నుంచి రిషికేశ్‌కు బస్సులో వెళ్లి అక్కడి నుంచి జోషిమఠ్ చేరుకోవాలి. దీని తర్వాత 17 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ద్వారా ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ పువ్వుల లోయలో అడుగు పెట్టాలంటే పర్మిట్ అవసరం. ఆ లోయను సందర్శించాలంటే గంగారియా నుంచి పర్మిట్ తీసుకోవాలి. ఇది 3 రోజులు మాత్రమే చెల్లుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. ఇది భారతీయులు రూ. 200 , విదేశీ పర్యాటకులు రూ. 800. చెల్లించాల్సి ఉంటుంది.




