- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Contestant Soniya Akula Shares Her Seemantham Ceremony Photos
Bigg Boss Telugu Soniya: ‘త్వరలోనే అమ్మవుతున్నా’ .. సీమంతం ఫొటోలు షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ
బిగ్ బాస్ తెలుగు తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. యశ్ వీర్ గ్రోనీని అనే అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల తార త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఇటీవల ఆమె సీమంతం వేడుకగా జరగ్గా ఇప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Updated on: Aug 07, 2025 | 5:58 PM

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు. తెలంగాణకు చెందిన ఈ అందాల తార బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తన అందం తో పాు ఆట, మాట తీరుతో బిగ్ బాస ఆడియెన్స్ ను అలరించింది.

సీజన్ ప్రారంభంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న సోనియా బిగ్ బాస్ షో చివరి వరకు ఉంటుందనుకున్నారు ఫ్యాన్స్. కానీ అదేమీ జరగలేదు.

హౌస్ లో లవ్ ట్రాక్ నడిపి పూర్తి నెగెటివిటీ తెచ్చుకున్న సోనియా అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు రాగానే తన ప్రియుడు యశ్ వీర్ గ్రోనీని అందరికీ పరిచయం చేసింది

పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు సోనియా-యశ్. ఇప్పుడు వీరు త్వరలో అమ్మానాన్నలు కాబోతున్నారు. సోనియా ఒక పండంట బిడ్డకు జన్మనివ్వనుంది.

ఈ నేపథ్యంలో సోనియాకు వేడుకగా సీమంతం నిర్వహించారు. ఈ వేడుకల్లో బుల్లితెర సెలబ్రిటీలతో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా పాల్గొని సందడి చేశారు. జబర్దస్త్ ఫేమ్ సుజాత, దంపతులతో పాటు బుల్లితెర నటి కీర్తి భట్, ప్రముఖ యాంకర్ ఓంకార్ కూడా హాజరయ్యాడు.

తాజాగా తన సీమంతం వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనియా. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గ మారాయి. వీటిని చూసిన పలువరు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోనియా దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.




