Unique temples of india: పురుషులకు అనుమతి లేని ఆలయాలు.. ఎక్కడో కాదు..మన దేశంలోనే..

మన దేశంలో పురుషులకు అనుమతి లేని దేవాలయాలు ఉన్నాయని వింటే షాక్ అవుతున్నారా? భారతదేశం పితృస్వామ్య సమాజం. ఇక్కడ యుగయుగాలుగా ప్రధాన రాజకీయ, ఆర్థిక శక్తికి కేంద్రంగా పురుషులే ఉంటున్నారు. పురుషాధిక్య సమాజం నేపథ్యంలో హిందూ చట్టాల ప్రకారం పురుషులు అనేక పవిత్ర ఆచారాలకు సంరక్షకులుగా ఉంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో పురుషులకు ప్రవేశం లేని కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda

|

Updated on: Jul 27, 2023 | 6:32 PM

Attukal Pongala- కేరళలోని అట్టుకల్ భగవతి ఆలయంలో పొంగల్ సందర్భంగా 10 రోజుల నారీ పూజ పండుగ జరుగుతుంది.. ఇక్కడ మహిళలకు మాత్రమే అనుమతి. ఈ ఆలయం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించింది. ప్రతి సంవత్సరం, పొంగల్ సందర్భంగా, ఈ ప్రదేశం దాదాపు మూడు మిలియన్ల మంది మహిళల సమ్మేళనంతో కనువిందుగా పండగ జరుగుతుంది.

1 / 5
Brahma Temple In Rajasthan- ఇక్కడ బ్రహ్మదేవుని ఏకైక ఆలయం ఉంది. ఇక్కడ వివాహిత పురుషులకు అనుమతి లేదు. సరస్వతీ దేవి శాపమే దీనికి కారణం. రాజస్థాన్, పుష్కర్‌లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న ఈ పద్నాలుగో శతాబ్దపు ఆలయం భారతదేశంలోని మూడు దేవాలయాలలో బ్రహ్మకు అంకితం చేయబడింది. బ్రహ్మదేవుడిని ఆరాధించడానికి ప్రపంచంలోని దేవాలయాలు చాలా తక్కువ.

2 / 5
Kamakhya Temple In Andhra Pradesh- ఇది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ పూజించే హక్కు స్త్రీలకు ఉంది. పురుషులకు అనుమతి లేదు. అస్సాంలోని కామాఖ్య దేవాలయం తరహాలో నిర్మించబడిన ఇది భారతదేశంలో పురుషులకు అనుమతి లేని మరొక ఆలయం. ఈ ఆలయంలో సహరాక్షి దేవత మరియు కామేశ్వర స్వామిని పూజిస్తారు.

3 / 5
Kumari Amman Temple In Tami- ఈ ప్రదేశంలో పార్వతీ దేవి శివుని ప్రేమను పొందేందుకు తపస్సు చేసిందని నమ్ముతారు. ఆమె ప్రార్థనల కోసం శక్తివంతమైన హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న నిర్జన ప్రదేశాన్ని ఎంచుకుంది. కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది . ఇది భారతదేశంలో పూర్తిగా స్త్రీలకు మాత్రమే అనుమతిస్తారు. ఇది వివాహిత పురుషులను ప్రాంగణంలోకి అనుమతించదు. అవివాహిత పురుషులు ఇప్పటికీ లోపలికి అనుమతించబడతారు. కాని గేటు వరకు మాత్రమే. ప్రాంగణంలోని గర్భగుడిలో ప్రత్యేకంగా నిర్మించిన కన్యా మా భగవతి దుర్గ దేవాలయం ఉంది. ఇందులో కేవలం ఆడవారు మాత్రమే ప్రవేశించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.

4 / 5
Mata Temple In Bihar- బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న మాతా రాజ రాజేశ్వర ఆలయం సంవత్సరంలో కొన్ని రోజులలో పురుషులకు ప్రవేశం లేని మరొక ఆలయం. మాతకు పీరియడ్స్ వచ్చే సమయం ఇది. ఈ సమయంలో మగ పూజారులను కూడా ఆలయంలోనికి అనుమతించరు. మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

5 / 5
Follow us