బాహుబలి 2 పేరు మీదున్న 10 రోజుల రికార్డును 6 రోజులకు తగ్గించాడు పుష్ప రాజ్. ఇక 1000 కోట్ల మార్క్ అందుకోడానికి ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2, కల్కి 2898 ఏడి సినిమాలకు 16 రోజులు పట్టింది. షారుక్ ఖాన్ జవాన్‌కు 18 రోజులు, పఠాన్ సినిమాకు 27 రోజులు పట్టింది. ఏదేమైనా పుష్ప 2 రికార్డ్ ఇప్పట్లో బద్ధలవ్వడమైతే కష్టమే.