Healthy Breakfast: హెల్దీ బ్రోకలీ, పాలకూర దోశ.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపీ..

పాలకూర, బ్రోకలీ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. బ్రోకలీ కూడా ఆకు కూరల కిందకే వస్తుంది. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి బ్రేక్ ఫాస్ట్‌లా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి..

Healthy Breakfast: హెల్దీ బ్రోకలీ, పాలకూర దోశ.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్ రెసిపీ..
Broccoli And Spinach Dosa
Follow us
Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 12, 2024 | 9:37 PM

పాలకూర, బ్రోకలీ రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. బ్రోకలీ కూడా ఆకు కూరల కిందకే వస్తుంది. ఈ రెండూ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి బ్రేక్ ఫాస్ట్‌లా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. డయాబెటీస్, బీపీ, క్యాన్సర్ పేషెంట్లు తింటే.. ఈ జబ్బులు మరింత కంట్రోల్ అవుతాయి. చాలా సింపుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి ఈ బ్రోకలీ, పాలకూర దోశలు ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రోకలీ, పాలకూర దోశలకు కావాల్సిన పదార్థాలు:

పాలకూర తరుగు, బ్రోకలీ, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, గరం మసాలా, నల్ల మిరియాల పొడి, ఉప్పు, పచ్చి మిర్చి, శనగ పిండి.

బ్రోకలీ, పాలకూర దోశలు తయారీ విధానం:

ముందుగా బ్రోకలీని, పాలకూరను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో బ్రోకలీ, పాలకూర, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కొద్దిగా నీళ్లు వేసి మొత్తం పేస్టులా చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో కొద్దిగా శనగ పిడి, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశ పిండి బ్యాటర్‌లా జారుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి.. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పిండితో దోశలు వేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ దోశలను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఏ చట్నీ లేకున్నా నేరుగా కూడా తినవచ్చు. ఇలా శనగ పిండి మిశ్రమంలో కాకుండా.. పాలకూర, బ్రోకలీ మిశ్రమాన్ని సాధారణ దోశ పిండిలో కూడా కలుపుకుని దోశలు వేసుకున్నా రుచిగానే ఉంటాయి. ఈ దోశలు తింటే బీపీ, షుగర్, క్యాన్సర్ కంట్రోల్ అవుతాయి.