- Telugu News Photo Gallery Apple cider vinegar is sure to help you lose weight, Check Here is Details
Apple Cider Vinegar: యాపిల్ సైడర్ వెనిగర్ ఇలా తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం!
యాపిల్ సైడర్ వెనిగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీని గురించి అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది. యాపిల్ సైడర్ వెనిగర్‌ను అనేక వాటికి ఉపయోగిస్తున్నారు..
Updated on: Dec 12, 2024 | 5:04 PM

ఈ మధ్య కాలంలో యాపిల్ సైడర్ వెనిగర్ గురించి వినే ఉంటారు. ప్రస్తుత కాలంలో ఎక్కువగా దీన్నే ఉపయోగిస్తున్నారు. ఈ యాపిల్ సైడర్ వెనిగర్‌ను అనేక రకాలుగా వాడేస్తున్నారు. అయితే దీంతో బరువు కూడా తగ్గొచ్చు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు యాపిల్ సైడర్ వెనిగర్ వాడవచ్చు.

అయితే దీన్ని వాడే విధానం తెలుసుకోవాలి. అధిక బరువు తగ్గకుండా బాధ పడేవారు ఈ రకంగా వాడితే.. త్వరగా ఈ సమస్య నుంచి బయట పడతారు. ప్రతి రోజూ ఉదయం, సాయత్రం గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకుంటే అధిక బరువు తగ్గుతుంది.

ముఖ్యంగా ఆపిల్ సైడర్ వెనిగర్.. గొప్ప సహజ హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. వెనిగర్‌లో కొంచెం నీరు వేసి, షాంపూ వేసి తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం మీ స్కాల్ప్ ను బ్యాలెన్స్ చేసి, చుండ్రుని తగ్గిస్తుంది.

మీకు ఇష్టమైన పండ్ల రసంలో కూడా యాపిల్ సైడర్ వెనిరగ్ మిక్స్ చేసుకుని తాగవచ్చు. ఇలా రోజుకు రెండు సార్లు తాగాలి. అయితే పంచదార కలపకుండా తాగాలి. ఇలా చేసినా బరువు తగ్గొచ్చు.

ముఖ్యంగా చలికాలంలో బట్టలను మృదువుగా చేయడానికి వెనిగర్ మంచి ఎంపిక. ఇది వాసనలు, మరకలను తొలగించడమే కాకుండా సున్నితమైన చర్మం ఉన్నవారికి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంటి గార్డెన్‌లో బుష్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంది.




