అలాగే రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోకపోవడం, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, పళ్లు తోముకోకుండా రాత్రి నిద్రపోవడం వంటి చెడు అలవాట్ల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే శ్వాసను తాజాగా ఉంచేందుకు మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎలాగంటే..
1 / 5
నోటి దుర్వాసనకు చాలా కారణాలు ఉన్నాయి. పళ్లకు ఆహారం ముక్కలు ఇరుక్కున్నా కూడా వాసన వస్తుంది. కాబట్టి నోటి దుర్వాసన వచ్చేవారు ఫ్లాసింగ్ చేసుకోవాలి. ప్రతి రోజూ రెండు సార్లు బ్రష్ చేయడం వల్ల దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.
2 / 5
ధూమపానం కారణంగా కూడా నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి ధూమపానం కంట్రోల్ చేసుకోవాలి. చిగుళ్లు పాడైపోయినా, పిప్పళ్లు ఉన్నా కూడా క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం.
3 / 5
చిగుళ్ల సమస్యలు, సైనస్ ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో సమస్యలు ఉన్నా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన ఎక్కువ రోజులు వస్తే మాత్రం.. ఖచ్చితంగా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.
4 / 5
జీర్ణ సమస్యల కారణంగా కూడా నోటి దుర్వాసన రావచ్చు. కాబట్టి సమస్య కేవలం నోటి నుంచే కాదు.. శరీరంలోని ఇతర భాగాల కారణంగా కూడా వస్తుంది. తులసి, పుదీనా తరచూ నములుతూ ఉండండి.