- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Pujita Ponnada Traditional Saree Photos Go Viral
Tollywood: టీసీఎస్‌లో జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి.. పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లతో సినిమాలు.. ఎవరో తెలుసా?
ఏపీలోని వైజాగ్ కు చెందిన ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేసింది. ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టీసీఎస్‌లో కొన్నేళ్ల పాటు విధులు నిర్వహించింది. అయితే సినిమాలపై ఆసక్తితో లక్షల జీతమొచ్చే జాబ్ ను వదిలేసింది.
Updated on: Dec 12, 2024 | 8:30 PM

2016లో నాగార్జున ఊపిరి సినిమాతో కెరీర్ ప్రారంభించింది పూజిత పొన్నాడ. ఆ తర్వాత నాగార్జున ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది.

అయితే పూజితకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఏదంటే రంగస్థలం అని చెప్పుకోవచ్చు. ఇందులో ఆది పినిశెట్టి ప్రియురాలు పద్మ పాత్రలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

ఆ తర్వాత రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ తదితర సినిమాల్లో నటించింది పూజిత.

అలాగే రవితేజ రావణాసుర సినిమాల్లో మరో కీలక పాత్ర పోషించింది. అయితే ఎందుకోకానీ ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మాత్రం రావడం లేదు

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో పూజిత కూడా కనిపించనుందని తెలుస్తోంది. అలాగే ఓ తమిళ సినిమాలోనూ నటిస్తోందీ అందాల తార.




