- Telugu News Photo Gallery Cinema photos Know Keerthy Suresh and Antony Thattil Age Gap as they get married in Goa
Keerthy Suresh: కీర్తి సురేశ్- ఆంటోనీల పెళ్లి వేడుక.. కొత్త జంట మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
ప్రముఖ నటి కీర్తి సురేష్ తన ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. గోవా వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Updated on: Dec 12, 2024 | 4:21 PM

ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ తన ప్రియుడు ఆంటోని తట్టిల్ తో కలిసి పెళ్లిపీటలెక్కింది. గురువారం (డిసెంబర్ 12) గోవా వేదికగా వీరి వివాహం జరిగింది.

కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు

కీర్తి సురేశ్ తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేశ్. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె వయసు సుమారు 32 సంవత్సరాలు


అంటే కీర్తి సురేష్, ఆంటోని తట్టిల్ ఏజ్ గ్యాప్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది దీపావళి రోజున వీరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చింది. ఇప్పుడు గోవాలో పెళ్లిపీటలెక్కారు.




