సైలెంట్ అయిన సంయుక్త మీనన్.. రీజన్ ఏమైయుంటుందబ్బా..!

Rajeev 

12 December 2024

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు సంయుక్త మీనన్.. చేసింది తక్కువ సినిమాలే కానీ భారీ క్రేజ్ తెచ్చుకుంది. 

భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైయ్యింది ఈ వయ్యారి. ఆ సినిమాలో రానా భార్య పాత్రలో కనిపించింది. 

 తనదైన శైలితో మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. 

సంయుక్త ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టాయి.

చివరిగా కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ అనే సినిమాలో కనిపించింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. 

ప్రస్తుతం సంయుక్త సైలెంట్ అయ్యింది. ఈ బ్యూటీ కొత్త సినిమాలను అనౌన్స్ చేయడం లేదు. ఇతర భాషల్లోనూ చేయడం లేదు. 

కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.