- Telugu News Photo Gallery Can't stand the cold? Taking these will make the body warm, Check Here is Details
Winter Foods: చలిని తట్టుకోలేక పోతున్నారా.. ఇవి తీసుకుంటే సరి..
చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే త్వరగా జబ్బుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సీజన్ చాలా మందికి బాడీ టెంపరేచర్ తగ్గిపోతుంది..
Updated on: Dec 12, 2024 | 4:47 PM

రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా చాలా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు కూడా కనిపించడం లేదు. చాలా మబ్బుగా ఉంటుంది. సాయంత్రం 4 లేదా 5 గంటలకే వాతావరణం చీకటిగా మారుతుంది.

చలి కాలంలో ఏ పనులూ చేయాలనిపించదు. చాలా బద్ధకంగా ఉంటుంది. చలి తీవ్రత పెరిగే కొద్దీ.. శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. ఇలా బాడీ టెంపరేచర్ డౌన్ అయితే.. చలిని తట్టుకోలేరు. కాబట్టి చలి కాలంలో ఖచ్చితంగా శరీరాన్ని వెచ్చగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

ఇలా శరీరంలో వేడిని పెంచే వాటిల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యిలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు కూడా ఉంటాయి. శీతాకాలంలో నెయ్యి తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చలిని కూడా తట్టుకోగరు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

శీతాకాలంలో ముల్లంగి తీసుకోవడం వలన కూడా పోషకాలు చక్కగా అందుతాయి. ఇది కూడా శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అదే విధంగా అల్లం, వెల్లుల్లి తీసుకున్నా శరీరంలో టెంపరేచర్ పడిపోకుండా ఉంటుంది.

చలి కాలంలో ఉల్లిపాయలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఉల్లిపాయలు తిన్నా చలి తీవ్రతను తగ్గుకోవచ్చు. ఉల్లిపాయలు తింటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నువ్వులు, ఆవాలు, నువ్వులు తిన్నా, వీటితో తయారు చేసిన ఆయిల్స్ వాడినా మంచిదే.




