- Telugu News Photo Gallery Chia Seeds Side Effects: Do not eat chia seeds with these foods know expert says
Chia Seeds: ఏ సీజన్ లోనైనా చియా సీడ్స మంచివే.. వీటితో కలిపి తింటే అనారోగ్యానికి వెల్కం చెప్పినట్లే..
చియా విత్తనాలు నేటి జనరేషన్ కు ఓ సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. చియా గింజలను తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ చియా సీడ్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. అయితే చియా విత్తనాలను తినేవారు ఎలా తినాలి అనే విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అదే సమయంలో చియా సీడ్స్ ను కొన్ని రకాల ఆహార పదార్ధాలతో తినడడం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. ఈ రోజు చియా సీడ్స్ నుజ్ ఏయే పదార్థాలతో తినకూడదో నిపుణులు చెప్పిన సలహాని తెలుసుకుందాం.
Updated on: Dec 12, 2024 | 4:12 PM

చియా గింజల్లో విటమిన్ బీ, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సహా చాలా పోషకాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చియా గింజలను మీ డైట్‍లో రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గేందుకు మీకు ప్రభావవంతంగా తోడ్పడతాయి. చాలా రకాలుగా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి.

చియా గింజల్లో ఉండే ప్రోటీన్ వల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. జీవక్రియ బాగుంటే క్యాలరీలు ఎక్కువగా బర్న్ అయ్యే అకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గేందుకు తోడ్పాటు దక్కుతుంది. జీర్ణక్రియను, పేగుల ఆరోగ్యాన్ని కూడా చియా సీడ్స్ మెరుగుపరుస్తాయి. చియా గింజలను నీటిలో నానబెట్టుకొని తీసుకోవచ్చు. పెరుగులో, సూత్మీల్లో, ఓట్ మీల్‍లో, ఇతర వంటకాల్లో వేసుకొని తినొచ్చు.

చియా విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు నమామి అగర్వాల్ చెప్పారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. అయితే చియా విత్తనాలను తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేదంటే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

అధిక ఫైబర్ ఆహారాలతో.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే చియా సీడ్స్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చియా సీడ్స్ లో ఇప్పటికే అధిక మొత్తంలో ఫైబర్ ఉంది. చియా గింజలను అధిక ఫైబర్ ఆహారాలతో కలిపి తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కరంగా మారుతుంది. జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉంటే ఆహార కలయిక అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

పాల ఉత్పత్తులు: చాలామంది చియా గింజలను పాలు లేదా పాల ఉత్పత్తులతో తింటారు. అయితే లాక్టోస్ అసహనం ఉన్నవారు పాల ఉత్పత్తులతో చియా విత్తనాలను తినకూడదు. పాలలో ప్రోటీన్లు, కొవ్వులు ఉంటాయి. చియా గింజల్లోని ఫైబర్‌తో ప్రోటీన్లు కలవడం వలన జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. గ్యాస్, ఉబ్బరం లేదా కడుపు తిమ్మిరి వంటి సమస్యలు సంభవించవచ్చు.

చక్కెర ఆహారాలు: చియా గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని చక్కెర అధికంగా ఉన్న ఆహారాలతో కలిపి తింటే.. చియా గింజల సహజ రుచి చాలా తేలికపాటిది. అంతేకాదు చాలా తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. దీంతో ఎక్కువ చక్కెరతో చియా గింజలు తినడం కేలరీలు అధికంగా పెరుగుతాయి.

చియా సీడ్స్ ను పొరపాటున కూడా సిట్రస్ పండ్లతో కలిపి తినొద్దు. కమలాఫలం, ద్రాక్ష, నారింజ వంటి పండ్లతో చియా సీడ్స్ ను కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కనుక చియా గింజలను రోజూ తింటుంటే.. దానిని ఏ పదార్థాలతో తినాలి? వేటితో తినకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.




