అఫీషియల్.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరంటే?

12 December 2024

Basha Shek

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 21న అమెరికాలో గేమ్‌ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరగనుంది.

కాగా అమెరికాలో ఓ భారతీయ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం అందులోనూ తెలుగు సినిమా కావడం ఇదే మొదటిసారి

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఈ విషయంపై సస్పెన్స్ వీడింది. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.

పుష్ప 2 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న డైరెక్టర్ సుకుమార్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రానున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.