Winter Drink: శీతాకాలంలో ప్రతి ఉదయం ఈ డ్రింక్ వేడి వేడిగా తాగారంటే.. రోగాలన్నీ పరార్!
Healthy morning drinks in Morning: శీతాకాలం మొదలైంది. ఉదయం, రాత్రి వేళలు కాస్త చలి గిలిగింతలు పెడుతుంది. రోజులు పడేకొద్దీ శీతాకాలంలో చలి మరింత విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ..
Updated on: Nov 05, 2025 | 1:24 PM

శీతాకాలం మొదలైంది. ఉదయం, రాత్రి వేళలు కాస్త చలి గిలిగింతలు పెడుతుంది. రోజులు పడేకొద్దీ శీతాకాలంలో చలి మరింత విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ.

మారుతున్న వాతావరణం శరీర రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీని వలన అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. అలాంటి సందర్భాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఏమి తింటారు, ఏం తాగుతారు అనే విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకు కొన్ని ముఖ్యమైన పానీయాలు ఎంతో తోడ్పడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ ఉదయం పూట వేడివేడిగా ఈ పానియాలు కప్పు తాగితే.. శీతాకాలంలో ఎప్పటికీ అనారోగ్యానికి గురికారు.

అల్లం, నల్ల మిరియాలు, తులసి, వంటి ఔషధ పదార్థాలతో తయారు చేసిన కషాయం ఈ సీజన్‌లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ కషాయాన్ని ప్రతిరోజూ తాగినా మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మాటిమాటికీ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఈ కాలంలో దరిచేరవు. ఈ కషాయంలోని పోషకాలు వాటిని నివారిస్తుంది.




