- Telugu News Photo Gallery These precautions are perfect for protecting your eyes from the scorching sun
Summer Eye Care: మండే ఎండలో కళ్లు జర భద్రం.. ఈ జాగ్రత్తలు కచ్చితం..
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే.. మీ కళ్ళకు కాస్త అసౌకర్యం కలుగుతుంది. ఎండ ప్రభావంతో కళ్ళు ఎర్రగా మారుతాయి.
Updated on: Mar 27, 2025 | 10:15 AM

ఈ వేసవిలో కళ్లపై జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. అంధత్వం, క్యాన్సర్ ప్రమాదం వంటివి వచ్చే అవకాశముంది. కాబట్టి ఈ పరిస్థితిలో మీ కళ్లను ఎలా చూసుకోవాలో చూడండి.

సన్ గ్లాసెస్ ఇప్పుడు ఫ్యాషన్ అని అనుకోకండి.. ఈ వేసవిలో అవి తప్పనిసరిగా ధరించాలి. ఎండలో ఉన్నప్పుడు సన్ గ్లాసెస్, టోపీ, వాటర్ బాటిల్ లాంటివి వెంట ఉంచుకోవడం ముఖ్యం అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. సన్ గ్లాసెస్ UVA - UVB రెండు రకాల కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తాయి.

ఎవరైనా కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే, దీని గురించి కూడా తెలుసుకోండి. మీ చేతులు కడుక్కోని కాంటాక్ట్ లెన్సులు ధరించండి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్సులు ధరించినా సన్ గ్లాసెస్ ఉపయోగించవచ్చు.

వేడి వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేషన్‌గా ఉండటం చాలా ముఖ్యం. శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు కళ్ళు పొడిగా మారుతాయి. కళ్ళ మంట, చికాకు, ఎర్రగా మారడం లాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం మూడు లీటర్ల నీరు తాగండి.

పిల్లల కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. సన్ గ్లాసెస్ ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఎండల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్, తలపై టోపీని ధరించాలి.





























