- Telugu News Photo Gallery Cinema photos Anasuya Bharadwaj beauty photoshoot in colorful outfits Photo Gallery
రంగుల దుస్తుల్లో రంగమ్మత్త.. అనసూయ అందాలు చూస్తే అసూయపుట్టదా!
గ్లామర్ బ్యూటీ, యాంకర్ ,నటి అనసూయ భరద్వాజ్ తాజాగా తన అందచందాలతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన ఒంపుసొంపులతో , రంగుల దుస్తులు ధరించి తన గ్లామర్‌తో కట్టిపడేసింది.స్టైలిష్ లుక్‌లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Updated on: Mar 30, 2025 | 1:19 PM

అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన అందచందాలతో కుర్రకారును మాయ చేస్తుంది.

జబర్దస్త్‌లో తన యాంకరింగ్, గ్లామర్‌లతో ఆకట్టుకున్న ఈ చిన్నది సొగ్గాడే చిన్నినాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసి అందరినీ ఆకట్టుకుంది.తర్వాత ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన, రంగస్థలం సినిమాలో ఛాన్స్ కొట్టేసి, ఈ మూవీలో రంగమత్తపాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

వరసగా ఆఫర్స్ రావడంతో, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ పుష్ప, పుష్ప2లో దాక్షాయణి పాత్రలో తన విలనిజం చూపిస్తూ నటనా విశ్వరూపం చూపిందనే చెప్పాలి. ఇలా సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మల్లో ఈ చిన్నది ముందుంటుది. తన హాట్, క్యూట్ క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్‌కు నిద్రలేకుండా చేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు ట్రెండీ డ్రెస్‌లో తన అందాలతో మతిపొగొడుతుంది. రంగులదుస్తుల్లో రంగమ్మత్త ఫొటోలు చూస్తే మతిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ పొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



