భూలోక స్వర్గం అంటే ఇదేనేమో.. ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
మీ స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసమీ ఈ సమాచారం. భారత దేశంలోని కొన్ని ప్రాంతాలు అందమైన అనుభూతినివ్వడమే కాకుండా, భూళోక స్వర్గాన్ని తలపిస్తాయంట. ఇంతకీ ఆ ప్రదేశాలు ఎక్కడున్నాయి? వాటి గురించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jul 28, 2025 | 7:50 PM

భారతదేశంలోని ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని కొన్ని అందమైన లోయలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయంట.అక్కడికి వెళ్తే ఆ ఆనందమే వేరే అంటున్నారు పర్యాటకులు. కాగా ఆ ప్రదేశాలు ఏవి అంటే. హిమాలయాలలో ఉన్న కాశ్మీర్ లోయ. దీని అందం గురించి ఎంత చెప్పినా తక్కే, దీనిని భూలోక స్వర్గం అని పిలుస్తారు. మంచుతో కప్పబడిన శిఖరాలు, మెరిసే సరస్సులు మరియు పచ్చని పచ్చిక బయళ్లతో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే అక్కడున్న అందమైన ప్రదేశాలలో స్పితి వ్యాలీ ఒకటి. మారుమూల ఉండే ఇది ఓ అందమైన స్వర్గం. ఈ లోయ చూడటానికి రెండు కళ్లు చాలవంట. చుట్టూ ఎత్తైన పర్వతాలు, పురాతన మఠాలతో నిండి మంచి అనుభూతిని ఇస్తుందంట. టూర్ ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ప్లేస్ అంటున్నారు టూరిస్టులు.

అందమైన లోయల్లో లడఖ్‌లోని నుబ్రా లోయ ఒకటి. ఈ ప్రదేశం చూడటానికి చాలా అద్భతంగా ఉంటుందంట. ఈ నుబ్రా లోయ ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇది ప్రసిద్ధ డిస్కిట్ మఠానికి నిలయం. ఇక్కడికి వెళ్తే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేమని చెబుతున్నారు పర్యాటకులు.

ఉత్తరాఖండ్‌లోని పూల లోయ. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది వర్షాకాలంలో వికసించే వేలాది జాతుల పుష్పాలతో భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. అందమైన పూల తోటల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రదేశం. పచ్చటి కొండల మధ్య రంగు రంగుల పూలతో ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూటానికి బాగుంటుందంట.

అందమైన లోయల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అరకులోయ ఒకటి. ఇక్కడి కాఫీ తోటలు, అందమైన ప్రకృతి దృష్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందమైన పూలతోటలు, ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చటి వాతావరణం, సరస్సుల సవ్వడులతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచడంలో ముందుంటుంది.



