- Telugu News Photo Gallery These are the benefits of eating dates in winter season, check here is details in Telugu
Dates Benefits: శీతా కాలంలో ఖర్జూరం తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే!
శీతా కాలం వచ్చిందంటే అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్య పరంగా, చర్మం, జుట్టు పరంగా కేర్ తీసుకోవాలి. లేదంటే మన శరీరాన్ని మనం చూసుకోవడానికి చిరాకుగా అనిపిస్తుంది. చలి కాలంలో తప్పకుండా కేర్ తీసుకోవాలి. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తి అస్సలు తగ్గకూడదు. లేదంటే వ్యాధులు ఎటాక్ చేసేస్తాయి. శీతా కాలంలో శరీరానికి మరింత శక్తిని ఇచ్చే ఫుడ్స్‌లో ఖర్జూరాలు కూడా ఒకటి. ఖర్జూరాలు తీసుకుంటే తక్కువ సమయంలోనే ఎనర్జీ లెవల్స్..
Updated on: Jan 12, 2024 | 1:16 PM

అలాగే మామిడి, నిమ్మ, జామ వంటి పండ్లను క్రమం తప్పకుండా తినడం అలవాటు చేసుకోవాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయాన్నే కొన్ని జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కనీసం 4-5 ఖర్జూరాలు తప్పక తినాలి.

ప్రతి రాత్రి రెండు ఖర్జూరాలను నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఆ ఖర్జూరాలు తినాలి. ఇది శరీరంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాగే పొట్ట కూడా శుభ్రంగా ఉంటుంది. గ్యాస్-అసిడిటీ వంటి కడుపు సమస్యలే కాదు, ఈ డ్రై ఫ్రూట్ బహుళ శారీరక విధుల్లో చాలా ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది.

మీరు చక్కెరకు బదులు స్వీట్ ఐటెమ్స్‌లో ఖర్జూరం పేస్ట్‌ని వాడుకోవచ్చు. దీని వల్ల ఆరోగ్యమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. జ్యూస్‌లు, పాలు, తీపి వంటకాల్లో ఈ ఖర్జూరాలను ఉపయోగించుకోవచ్చు. ఖర్జూరాలను నేరుగా తినడం ఇష్ట పడని వారు వీటిని.. వీటితో స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చు.

నేటి కాలంలో గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు సర్వ సాధారణం అయ్యాయి. ఈ సమస్యలన్నింటిని ఇంటి నుంచే నివారణ పొందవచ్చు. ముందుగా యాంటాసిడ్‌లను తీసుకోవడం మానుకోవాలి. అసిడిటీని సులభంగా వదిలించుకోవడానికి ప్రతిరోజూ ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.

మన శరీరంలోని సమస్యలన్నీ పోషకాహార లోపం వల్ల ఏర్పడతాయి. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్లనే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఆహారం అజీర్ణం, ఊబకాయం, నిద్రలేమితో పాటు గ్యాస్-గుండె మంట వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.




