AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coriander Leaves: కొత్తిమీరను ప్రతిరోజూ తింటున్నారా.? అయితే ఇది తెలుసుకోండి..!

కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తి మీర ప్రత్యేకత. అయితే, కొత్తి మీర రుచిలోనే కాదు, ఆరోగ్య సమస్యలను తగ్గించడంతో కూడా అద్భుతంగా సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిని తరచూ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Jan 12, 2024 | 1:16 PM

Share
Coriander Leaves

Coriander Leaves

1 / 5
బరువు తగ్గాలనుకునేవారు కూడా కొత్తిమీరను డైట్ లో చేర్చుకోవచ్చు. దీనిలో కేలరీలు అసలే ఉండవు. అంతేకాక ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.  కొత్తిమీర ఆకులు మన రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఇది వ్యాధులతో పోరాడటానికి మనకు సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు జీర్ణ ప్రక్రియను సులభతరం చేయడానికి కూడా సహాయపడతాయి. కొత్తిమీరను తింటే గ్యాస్ వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

2 / 5
 
కొత్తిమీర ఆకులు కొలెస్ట్రాల్ కు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే దీన్ని రెగ్యులర్ గా తింటే మీ గుండెకు ఎలాంటి ముప్పు ఉండదు.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి  కూడా కొత్తిమీర ఆకులు సహాయపడతాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్లు కూడా దీన్ని తినొచ్చు.

3 / 5
కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది. నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవి నయమవుతాయి. కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి పుక్కిలిస్తే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

4 / 5
కొత్తిమీర వాతాన్ని తగ్గిస్తుంది. బీపీ, డయాబెటిస్ వ్యాధులు ఉన్న వారికి ఉపయోగపడుతుంది. కొత్తమీర పచ్చడి చేసుకుని అన్నంలో తింటే కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మల విసర్జన సాఫీగా ఉంటుంది. ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీర ఆకుల రసం తేనెతో కలుపుకొని తాగాలి. కొత్తిమీరలో విటమిన్ కే ఉంటుంది. ఇది మీ శరీరంలో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.

5 / 5