- Telugu News Photo Gallery Telangana: Over 120 temples have been built in Vellulla village of Metpalli mandal of Jagityala district, know the reason
అ ఊరిలో కోరిన కోర్కెలు తీరితే ఏకంగా గుళ్ళు కట్టేస్తారు.. ఊరినిండా ఆలయాలే!
ఇదొక ఆధ్యాత్మిక గ్రామం. ఇక్కడ కోరిన కోర్కెలు తీరుతే ఆలయాలు నిర్మిస్తారు. దీంతో ఆ గ్రామం నిండా ఆలయాలే. ఈ గ్రామంలో 120 కి పైగా ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా కోరిన కోరికలు తీరాలని దేవుడిని ప్రార్థించటం సహజం. కోరిన కోరిక లు తీరుతే కొబ్బరికాయ కొట్టాడామో లేదంటే తలనీలాలు సమర్పించడం, ఇరత మొక్కుబడులు లేదా ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటాం. ఐతే ఈ గ్రామంలో మాత్రం కోరిన కోర్కెలు తీరుతే ఏకంగా ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ ఆలయాల గ్రామం గురించి తెలుసుకుందాం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 5000 మంది జనాభా ఉంటుంది. ఈ గ్రామంలో..
Updated on: Aug 23, 2023 | 1:42 PM

ఇదొక ఆధ్యాత్మిక గ్రామం. ఇక్కడ కోరిన కోర్కెలు తీరుతే ఆలయాలు నిర్మిస్తారు. దీంతో ఆ గ్రామం నిండా ఆలయాలే. ఈ గ్రామంలో 120 కి పైగా ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా కోరిన కోరికలు తీరాలని దేవుడిని ప్రార్థించటం సహజం. కోరిన కోరిక లు తీరుతే కొబ్బరికాయ కొట్టాడామో లేదంటే తలనీలాలు సమర్పించడం, ఇరత మొక్కుబడులు లేదా ఏమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతుంటాం. ఐతే ఈ గ్రామంలో మాత్రం కోరిన కోర్కెలు తీరుతే ఏకంగా ఆలయాలను నిర్మిస్తున్నారు. ఈ ఆలయాల గ్రామం గురించి తెలుసుకుందాం..

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో 5000 మంది జనాభా ఉంటుంది. ఈ గ్రామం లో 95 శాతం పైగా వ్యవసాయం చేసుకొని జీవిస్తారు. ఈ గ్రామం లో ఆధ్యాత్మికత దైవచింతన ఎక్కువనే ఉంటుంది.పంట పొలాలు పచ్చని పైరులతో ఆ గ్రామం కలకల లాడుతూ ఉంటుంది. గతం అన్ని గ్రామాల్లో లాగా ఇక్కడ కూడా రెండు మూడు ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆలయాల్లో స్థానికులు పూజలు చేసేవారు.

ఏమైనా కోరిన కోర్కెలు తీరుతే.. ఆలయం నిర్మిస్తామని మొక్కు కునే వారు.. కోరిన కోర్కెలు తీరుతే.. ఆలయం నిర్మించే వారు చాలా మంది కి అనుకున్నది జరిగింది. దింతో గ్రామం లో పెద్ద ఎత్తున ఆలయాల నిర్మించారు. ఒక్కటీ కాదు.. రెండు కాదు ప్రస్తుతం.. ఈ గ్రామం లో 120 వరకు ఆలయాలు ఉన్నాయి. అందులో హనుమాన్ ఆలయలే 50 వరకు ఉన్నాయి. రోడ్డు కు ఇరు వైపు ల ఆలయాలు దర్శనమిస్తున్నాయి.

అంతే కాదు.. గ్రామ శివారులో వివిధ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు పూజలు జరుగుతాయి. స్థానికులే పూజారులు ప్రతి ఆలయం పూజలు జరుగుతాయి. ఈ ఆధ్యాత్మిక గ్రామాన్ని చూడటానికి.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. ఈ గ్రామం లో ప్రతి రోజు జాతర.. శ్రావణ మాసం, ఇతర పర్వ దినాల్లో వేడుకలు జరుగతాయి. ఒక్కే గ్రామం లో ఇన్ని ఆలయాలు ఉండటం చాలా అరుదు.

ఇక్కడే ఎలాంటి కరువు లేకుండా రెండు పంటలు పండుతున్నాయి.. చాలా మందికి మంచి జరగడం తో ఆలయాలు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. స్థలం లేకపోవడం తో కొత్తగా ఆలయ నిర్మాణాలు జరగడం లేదు.. అఈ ఆధ్యాత్మిక గ్రామాన్ని చూస్తే భక్తి భావం వెల్లు విరుస్తుంది. ఉదయం, సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ భజన కార్యక్రమం లో పాల్గొంటున్నారు.
