- Telugu News Photo Gallery Technology photos Whatsapp introducing screen shock block feature, Check here for full details
WhatsApp: మీ వాట్సాప్ డీపీని ఎవరైనా స్క్రీన్ షాట్ తీస్తారని భయపడుతున్నారా.?
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే. ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్ ఉందని చెప్పాలి. ఇక తాజాగా వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు..
Updated on: May 14, 2024 | 10:52 AM

సోషల్ మీడియా విస్తృతి ఎలా పెరిగిందో అదే సమయంలో ప్రైవసీకి కూడా ప్రమాదం ఏర్పడుతోంది. ముఖ్యంగా ప్రొఫైల్ ఫొటోలు మిస్‌యూజ్ అవుతోన్న సందర్భాలు ఎన్నో చూశాం.

ఈ నేపథ్యంలోనే ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్ డిస్‌ప్లే పిక్చర్‌కు సైతం ప్రైవసీ అందిస్తోంది. ఇందులో భాగంగా మీ డీపీ ఎవరెవరికీ కనిపించాలనే విషయాన్ని మీరే సెట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

అయితే కొన్ని సందర్భాల్లో వాట్సాప్ డీపీలను కొందరు స్క్రీన్ షాట్స్ తీసుకొని మిస్‌యూజ్ చేసే అవసరాలు కూడా లేకపోలేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. యూజర్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు.

ఎవరైనా మన ప్రొఫైల్ పిక్ లేదా, స్టేటస్‌ను స్క్రీన్‌షాట్ తీసినప్పుడు ఆ ఫొటోకు బదులుగా బ్లాక్ స్క్రీన్ చూపించే ఫీచర్‌ను తీసుకొస్తోంది. దీంతో ఇకపై ఎవరూ మీ డీపీ లేదా స్టేటస్‌ను స్క్రీన్ షాట్‌ను తీసుకోలేరు.

స్క్రీన్‌షాట్ బ్లాకింగ్ ప్రొఫైల్ ఫొటో పేరుతో ఈ ఫీచర్‌ను తీకొస్తున్నారు. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌లో పరీక్షిస్తున్నారు. అయితే ఈ ఫీచర్‌ను ఐఓఎస్‌లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేనున్నారు.





























