- Telugu News Photo Gallery Technology photos Follow these simple tips to know who blocked in whatsapp
Whatsapp: మిమ్మల్ని వాట్సాప్‌లో ఎవరైనా బ్లాక్ చేశారని డౌట్‌గా ఉందా.? ఇలా తెలుసుకోండి..
వాట్సాప్ ఉయోగించని వారు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు గుర్తింపు ఉంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటిక్పపుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌లో మీకు తెలియని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయి. వాటిలో ఒక ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 13, 2024 | 11:39 AM

వాట్సాప్‌లో ఇతరుల కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడం సర్వ సాధారణమైన విషయమే. అయితే మనల్ని ఎవరు బ్లాక్ చేశారన్న విషయం తెలుసుకోవడం మాత్రం అంత సులభమైన విషయం కాదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ద్వారా మనల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారన్న అనుమానం వస్తే. వారి కాంటాక్ట్ ఓపెన్ చేసి చూడాలి. ఒకవేళ వారి లాస్ట్ సీన్ కనిపించకపోతే వారు మిమ్మల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భంగా సెట్టింగ్స్‌లో మార్పుతో కూడా లాస్ట్ సీన్ హైడ్ చేసుకున్నా కనిపించే అవకాశాలు ఉండవని గుర్తు పెట్టుకోవాలి.

ఇక ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుకుంటున్న వారి ప్రొఫైల్ పిక్చర్ కనిపించకపోయినా బ్లాక్ చేశారని భావించాలి. అయితే ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా కొందరికీ కనిపించేలా సెట్ చేసుకునే అవకాశం ఉన్నవిషయం తెలిసిందే.

మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారనే అనుమానం ఉంటే. వారికి ఒక మెసేజ్‌ను పంపించి చూడండి. ఒకవేళ బ్లూ టిక్స్ రాకుంటే సదరు వ్యక్తి మిమ్నల్ని బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాలి.

మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారనే సందేహం ఉంటే వారికి ఒకసారి కాల్ చేసి చూడండి. ఒకవేళ వారికి కాల్ కనెక్ట్ అవ్వకపోతే బ్లాక్ చేశారని అర్థం చేసుకోవాలి. ఇక అన్నింటికంటే సింపుల్ ట్రిక్ ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసి వారి నెంబర్‌ను యాడ్ చేయండి. ఒకవేళ గ్రూప్‌లో సదరు నెంబర్ యాడ్ అవ్వకపోతే మీ నెంబర్‌ను బ్లాక్ చేశారని అర్థం.





























