6G technology: ఒక్క సెకన్‌లో 5 సినిమాలు డౌన్‌లోడ్‌.. 6జీ టెక్నాలజీతో అద్భుతం.

ఒకప్పుడు 2జీ నెట్‌వర్క్‌ వినియోగం.. ఆ తర్వాత ఇంటర్నెట్ వేగం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 4జీతో ఒక్కసారిగా వేగం పెరిగింది. ఇక 5జీ రాకతో ఊహకందని ఇంటర్నెట్ వేగం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే దేశంలో 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. ఇదిలా ఉంటే జపాన్‌ మరో అడుగు ముందుకేసి 6జీ టెక్నాలజీ పరీక్షించింది. ఇందులో భాగంగానే కొత్త డివైజ్‌ను రూపొందించింది..

Narender Vaitla

|

Updated on: May 13, 2024 | 10:58 AM

6జీ టెక్నాలజీ ఆవిష్కరణలో జపాన్‌ కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొట్టమొదటి 6జీ వైర్‌లెస్‌ పరికరాన్ని రూపొందించింది. ఈ వేగంతో కేవలం ఒక సెకన్‌లో 5 హెచ్‌డీ సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

1 / 5
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ వేగంతో పోలిస్తే 6జీ 20 రెట్లు ఎక్కువ వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. జపాన్‌ రూపొందించిన ఈ కొత్త డివైజ్‌ 100 గిగాహెర్ట్జ్‌ (జీహెచ్‌జెడ్‌) బ్యాండ్‌ మీద 100 జీబీపీఎస్‌ వేగంతో డేటాను ప్రసారం చేస్తుంది.

2 / 5
మరో 6 నుంచి 7 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో 6జీ సేవలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక 6జీ టెక్నాలజీపై ఇప్పటికే అమెరికా, చైనా, భారత్‌ సైతం కసరత్తు ప్రారంభిచాయి. ఈ టెక్నాలజీతో ప్రజలు రియల్ టైమ్ హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ చేయగలరని నిపుణులు అంచనా వేస్తున్నారు.

3 / 5
అలాగే 6జీ టెక్నాలజీ రాకతో వర్చువల్, మిక్స్డ్ రియాలిటీ ప్రపంచంలో కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను చూస్తారని అంచనా. 6జీ టెక్నాలజీ పరీక్షలను జపాన్‌కు చెందిన డొకొమో, ఎన్‌టీటీ, కార్పొరేషన్‌, ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ వంటి కంపెనీలు నిర్వహించాయి.

4 / 5
ఇదిలా ఉంటే 6జీ టెక్నాలజీని పూర్తి స్థాయిలో తీసుకురావడానికి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న టవర్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అలాగే 6జీ ఇన్‌బిల్ట్ యాంటెన్నాతో కూడిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి విడుదల చేయాల్సి ఉంటుంది.

5 / 5
Follow us