AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మీకు నెగిటీవ్‌ ఫీలింగ్‌ పోవాలంటే.. నిద్రలేచిన వెంటనే వీటిని చూడండి!

మారుతున్న లైఫ్‌స్టైల్, వర్క్‌ప్రెజర్‌ కారణంగా చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇవి క్రమంగా పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. వీటి భారీ నుంచి మనం బయట పడాలంటే.. మార్నింగ్ లేచిన వెంటనే మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల ప్రకారం.. మనం నిద్రలేచిన వెంటనే మన మనస్సులో వచ్చే భావాలు, ఆలోచనలు, శారీరక అనుభూతులు రోజువారి మన పని తీరు, మానసిక స్థితిని ప్రభావితం చేయనున్నాయని అంటున్నారు. కాబట్టి నిద్రలేచిన వెంటనే.. నెగిటివ్‌ వైబ్‌ ఇచ్చే ఆలోచనలు, విజువల్స్‌ చూడడం కన్నా.. పాజిటీవ్‌ వైబ్‌ ఉన్న వాటిని చూడడం వల్ల మన మైండ్‌ను రిలాక్స్‌గా ఉంచుకోవచ్చు. మనకు లేచినవెంటనే పాజిటీవ్‌ వైబ్‌ను ఇచ్చే కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం

Anand T
|

Updated on: Aug 27, 2025 | 6:32 PM

Share
సూర్యోదయం: ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యోదయాన్ని చూడడం వల్ల.. మన శరీరానికి విటమిన్‌ డీ అందడంతో పాటు.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు తోల్పడుతుంది. ఈ సూర్యకాంతి సెరోటొనిన్ అనే హార్మోన్‌ను రిలీజ్ చేసి.. మన మూడ్‌ను సెట్‌చేస్తుంది. దీంతో మనకు మానసిక ప్రశాంతతతో పాటు శక్తి కూడా లభిస్తుంది. అలాగే మనం రోజు మొత్తం ఉల్లసంగా ఉంటాం.

1 / 5
ఆకుపచ్చ చెట్లును చూడటం: ఉదయం లేచిన వెంటనే ఆహ్లాదకరమైన ప్రకృతిని చూడటం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు పచ్చని వాతావరణం మనలో ఒత్తిడిని తగ్గించి, మైండ్‌ను రిలాక్స్‌ చేస్తుంది.

2 / 5
దేవుడి ఫోటోలను చూడటం: నిద్రలేచిన వెంటనే దేవుడి ఫోటోలను చూడటం లేదా ధ్యానం వంటివి చేయడం వల్ల మనలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దాంతో పాటు మన మనసు స్థిరంగా ఉంటుంది. ఆ రోజు మొత్తం మనం పాజిటివ్ ఎనర్జీతో ఉంటాము.

3 / 5
ప్రేరణ కలిగించే కొటేషన్స్: చాలా మందికి బెడ్‌రూమ్‌లో కొటేషన్స్‌ పెట్టుకోవడం అలావాటు. నిద్రలేచిన వెంటనే వాటిని చదవడం వల్ల మన ప్రేరణ పెరుగుతుంది. వాటిని త్వరగా అచీవ్‌ చేయాలనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

4 / 5
ఇష్టమైన వ్యక్తులను: లేచిన వెంటనే మనకు ఇష్టమైన వ్యక్తుల ముఖాలను చూడడం వల్ల మన హృదయంలో ప్రేమ, శాంతి అనే ఫీలింగ్ కలుగుతుంది. మనసు తేలికగా మారి ఒత్తిడి దూరమవుతుంది. ఇలా మనం రోజంతా యాక్టీవ్‌గా, రిలాక్స్ మైండ్‌సెట్‌తో ఉండాలంటే.. పాజిటీవ్‌ దృష్టితో చూసే దృశ్యాలను చూడడం మంచింది.

5 / 5