- Telugu News Photo Gallery Spiritual photos These are the Varalakshmi Vratham Puja timings for August 8, 2025
రేపే వరలక్ష్మీ వ్రతం.. ఈ పూజా సమయాలను మిస్ అవ్వకండి!
వరాలనిచ్చే వరలక్ష్మీ తల్లిని ప్రతి ఒక్కరూ ఎంతో నిష్టగా, నియమ నిబంధనలతో పూజించుకుంటారు. శ్రావణ మాసంలో శుక్లపక్షం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. హిందువులందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇక వివాహమైన స్త్రీలందరూ ఉపవాసం ఉంటూ, ఈ దేవతను పూజించుకుంటారు. దక్షిణ భారత దేశంలో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.
Updated on: Aug 07, 2025 | 1:16 PM

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలలో ఈ పండుగ బాగా ప్రాచుర్యం పొందింది. వరలక్ష్మీ వ్రతాన్నిమహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఆచరిస్తారు. అంతే కాకుండా సంపదకు చిహ్నం వరలక్ష్మీ దేవి. అందువలన సిరులు కురిపించే సిరుల తల్లి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు లభిస్తాయని ప్రతి ఒక్కరీ నమ్మకం. అలాగే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం అంటే, లక్ష్మీదేవి ఎనిమిది రూపాలను గౌరవించడం.

ఇక ఈ సారి 2025 సంవత్సరంలో ఆగస్టు 8న ఈ పండుగను జరుపుకోనున్నారు. కాగా, ఇప్పుడు మనం వరలక్ష్మీ వ్రతం పూజా సమయాలు ఏవో చూసేద్దాం.. ఈ సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం కోసం , సింహ లగ్న పూజ ముహూర్తం ఉదయం 06 : 42 నిమిషాల నుంచి 8 :47 వరకు, అలాగే వృశ్చిక లగ్నం మధ్యాహ్నం 01:00 నుంచి మధ్యాహ్నం 03:13 వరకు, అలాగే కుంభ లగ్నం మధ్యాహ్నం 07 :11 నుంచి 08 :50 వరకు, అలాగే వృషభ లగ్నం ఉదయం 12 :14 నుంచి 02:15 నిమిషాల వరకు. ప్రదోషకాలంలో సాయంత్రం వేళలు అత్యంత అనుకూలమైనవిగా భావిస్తారు.

ఇక శ్రీ మహావిష్ణువు భార్య అయిన మహాలక్ష్మి వరాలను ప్రసాదించే వర లక్ష్మీలా కొలువు దీరి భక్తుల కోరిక్కెలను తీరుస్తుంది. ప్రతి సంవత్సరం వరలక్ష్మీ తల్లిని పూజించడం వలన ఇంటిలో సంపద, ఆరోగ్యం, ఆనందం పెరగడమే కాకుండా, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

ఇక వరలక్ష్మీ పూజా ఆచారాలు దీపావళి సమయంలో చేసే మహాలక్ష్మీ పూజలా ఉంటుంది. కానీ ఈ వ్రతానికి ప్రత్యేకమైన నైవేద్యాలు, మంత్రాలు ఉంటాయి. అలాగే పూజ సమయంలో కట్టే పవిత్ర దారాన్ని తోరం అంటారు. ఇది రక్షణ, ఆశీర్వాదాలను సూచిస్తుంది. వరలక్ష్మీ తల్లికి నైవేద్యంగా తీపి వంటకం సమర్పిస్తారు, ముఖ్యంగా ఆవుపాలతో పరమాన్నం తయారు చేస్తారు. ఈ నైవేద్యం అమ్మవారికి చాలా ఇష్టం.

ఇక వరలక్ష్మీ వ్రతం, కలశ స్థాపనతో ప్రారంభం అవుతుంది. తరవాత లక్ష్మీ అష్టోత్తర శతానామావళి, హారతి, తోరం కట్టడం జరుగుతుంది. తర్వాత భక్తులు లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ప్రతిమను పువ్వులు, ఆభరణాలు, పట్టువస్త్రాలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో, మంత్రాలను జపిస్తూ.. పూజ చేస్తారు.



