- Telugu News Photo Gallery Spiritual photos Shani transit 2025 : These five lucky zodiac signs of saturn transit in pisces
పేదని రాజుని చేయగల శనీశ్వరుడు మీన రాశిలో సంచారం.. 2027 వరకు ఈ ఐదు రాశుల వారిపై కాసుల వర్షం
నవ గ్రహాల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం. శనీశ్వరుడు న్యాయాధిపతి కర్మ ఫలదాత అని విశ్వాసం. అంతేకాదు గ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం కూడా శనీశ్వరుడే. అందుకనే మందగమనుడు అని కూడా పిలుస్తారు. అయితే ప్రస్తుతం శని దేవుడు మీన రాశిలో సంచారము చేస్తున్నాడు. మీనరాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. 29 మార్చి 2025న శని గురువు మీనరాశిలో అడుగు పెట్టాడు. జూన్ 2, 2027 వరకు ఈ రాశిలోనే శనీశ్వరుడు ఉంటాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై చూపించినా.. ఐదు రాశులకు చెందిన వారిపై మాత్రం ప్రత్యేక ఆశీర్వాదాలను అందించనున్నాడు. శని దేవుడు శుభప్రదంగా ఉన్నప్పుడు..ఆ వ్యక్తి జీవితం రాజులా సాగుతుంది. శనిశ్వరుడి అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా రాజుగా మారగలడు. ఈ నేపధ్యంలో 2027 వరకూ శనిశ్వరుడి అనుగ్రహం ఉండే రాశులు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: Aug 07, 2025 | 11:17 AM

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడిని న్యాయ దేవుడు అని కూడా పిలుస్తారు. అన్ని గ్రహాలలో శని దేవుడు అత్యంత నెమ్మదిగా కదులుతాడు. శని దేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు మీనరాశిలో సంచారము చేస్తున్నాడు. 2027 వరకు మీనరాశిలోనే ఉంటాడు. మీనరాశిలో ఉండటం వలన శనీశ్వరుడి 5 రాశులపై ప్రత్యేక ఆశీర్వాదాలను కురిపించనున్నాడు. శనీశ్వరుడు శుభప్రదంగా ఉన్నప్పుడు.. శని అనుగ్రహంతో పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. ఈ నేపధ్యంలో 2027 వరకు శని దేవుడి ప్రత్యేక ఆశీర్వాదాలు ఏ రాశులపై ఉండనున్నాయో తెలుసుకుందాం..

వృషభ రాశి: శనీశ్వరుడి ప్రస్తుతం వృషభ రాశి పదకొండవ ఇంట్లో సంచరిస్తున్నాడు. శని దేవుడు 2027 వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు. ఈ సమయంలో వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభపడే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ఈ రాశికి చెందిన వారికీ స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఎంత పెద్ద ప్రాజెక్టులను చేపట్టినా వాటిల్లో విజయం సాధించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి: శనీశ్వరుడి ప్రస్తుతం కర్కాటక రాశి తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడి 2027 వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు. దీంతో వీరు ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. అదృష్టం వీరి సొంతం. ఈ సమయంలో విదేశీ ప్రయాణ అవకాశాలు ఉంటాయి. స్టూడెంట్స్ విద్యా రంగంలో కూడా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు. ఈ సమయంలో చెడిపోయిన పనులు జరుగుతాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మధురంగా ఉంటాయి.

తులా రాశి: శనీశ్వరుడు ప్రస్తుతం ఆరవ ఇంట్లో తులారాశిలో సంచరిస్తున్నాడు. శని దేవుడు 2027 వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు. దీంతో వీరికి ఆర్థిక లాభం ఉంటుంది. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. ఈ కాలంలో పెట్టుబడి పెట్టడం వల్ల మాత్రమే ప్రయోజనం పొందుతారు. ఉద్యోగం, వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు వీరు తమ శత్రువులపై విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి: శని దేవుడు ప్రస్తుతం వృశ్చిక రాశి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. 2027 వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన యువతీ యువకులకు వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పిల్లల ద్వారా సంతోషం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు.

మకర రాశి: శని దేవుడు ప్రస్తుతం మకర రాశి మూడవ ఇంట్లో సంచరిస్తున్నాడు. శని దేవుడు 2027 వరకు ఈ ఇంట్లోనే ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆత్మవిశ్వాసం గరిష్ట స్థాయిలో ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీరికి తమ కుటుంబ సభ్యిల నుంచి మద్దతు లభిస్తుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అది లభాదయకంగా ముగుస్తుంది. వీరు ప్రయాణం చేయడం ద్వారా లాభాలను పొందే అవకాశం ఉంది.




