- Telugu News Photo Gallery Spiritual photos Sri Ramanuja Statue Of Equality Celebrations At Chinajeeyar Swamy Ashram Muchintal Photos
సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలు.. భక్తి పారవశ్యంలో జనం.. ఫోటోలు మీకోసమే..
Statue of Equality: హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. దీనిలో భాగం జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు...
Updated on: Feb 05, 2022 | 7:35 AM

హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు నాలుగో రోజుకు చేరుకుంది.

ఉత్సవాల్లో మూడో రోజు యాగశాలలో లక్ష్మీనారాయణ యాగం, లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. ఈ మహాయాగం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది. చినజీయర్ స్వామితోపాటు ఏడుగురు జీయర్ స్వాముల సమక్షంలో పూజలు నిర్వహిస్తున్నారు.

రామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో మహిళల కోలాటం హైలెట్‌గా నిలుస్తుంది. టీటీడీ నుంచి వచ్చిన మహిళలు బృందాలుగా కోలాటం ఆడుతూ శ్రీరామనుజాచార్యుల సేవలో తరిస్తున్నారు. మహిళల కోలాటం స్పాట్ నుంచి మా ప్రతినిధి కృప మరిన్ని వివరాలు అందిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా నేడు యాగశాలలో శ్రీలక్ష్మీనారాయణేష్టి, సత్సంతానానికై వైనేతేయేష్టి, శ్రీలక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజలు జరుగనున్నాయి. కార్యక్రమంలో ప్రధానఘట్టం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. నేడు సాయంత్రం ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాని మోదీ.. 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహం జాతికి అంకితం ఇవ్వనున్నారు.

చినజీయర్‌స్వామి ఆహ్వానం మేరకు శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. పీఎం హైదరాబాద్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.

ప్రధాని నేడు మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను మోదీ ప్రారంభిస్తారు.

మొక్కల సంరక్షణపై ఇక్రిశాట్ వాతావరణ మార్పు పరిశోధనా సదుపాయం, రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రధాని ప్రారంభిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన ఇక్రిశాట్ లోగోను మోదీ ఆవిష్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేస్తారు.

అనంతరం ప్రధాని మోదీ ముచ్చింతల్ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరుతారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆయన ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. యాగశాలలో సాయంత్రం 6 గంటలకు పెరుమాళ్లను దర్శించుకొని విశ్వక్ సేనుడి పూజ చేస్తారు. అనంతరం సమతామూర్తి కేంద్రానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొంటారు.

216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్ స్వామితో కలిసి పూజ చేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితమిస్తారు. అనంతరం అక్కడి నుంచే మోదీ తన సందేశాన్నిస్తారు. మోదీ సమక్షంలోనే రామానుజచార్యుల విగ్రహంపై 15 నిమిషాలపాటు 3డీ లైటింగ్ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు.

మోదీ ముచ్చింతల్ ఆశ్రమం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణించే మార్గంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రూట్‌లో మోదీ ప్రయాణించే సమయంలో ఎవరినీ అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. ముచ్చింతల్ ఆశ్రమం నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మోదీ ఢిల్లీ బయలుదేరి వెళతారు.

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమతామూర్తి కేంద్రం, విగ్రహ పరిసరాలను సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పరిశీలించారు. పీఎం టూర్‌ను విజయవంతం చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ప్రధాని పాల్గొనే వేదికల వద్ద భద్రతా ఏర్పాట్లతోపాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును స్ట్రిక్ట్‌గా అమలు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. వీవీఐపీ పర్యటన సమయంలో కరోనా ప్రొటోకాల్స్ పాటించేలా చూడాలని హెల్త్సెక్రటరీని సీఎస్ ఆదేశించారు.

ముచ్చింతల్‌లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.

Statue Of Equality Celebrations

Statue Of Equality Celebrations

Statue Of Equality Celebrations
