- Telugu News Photo Gallery Spiritual photos Oct Nov Rajayoga: Saturn Venus Blessings for 6 Rashi Details in Telugu
Raja Yoga: శని, శుక్రుల వీక్షణ.. ఈ రాశులకు రాజయోగాలు..! సంపదకు రెక్కలు
Saturn-Venus Blessings: జ్యోతిష శాస్త్రం ప్రకారం శని, శుక్రులు కలవడం, పరస్పరం వీక్షించుకోవడం రాజయోగాలను కలిగిస్తుంది. ఈ రెండూ మిత్ర గ్రహాలు. అక్టోబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శని, శుక్ర గ్రహాల మధ్య పరస్పర వీక్షణ ఉంటుంది. ఇందులో శని మీన రాశిలో సంచారం చేస్తుండగా, శుక్రుడు కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు సమ సప్తకంలో ఉన్నందువల్ల వీటి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడుతోంది. దీని వల్ల కొన్ని రాశులకు సంపద పెరగడం, హోదాలు పెరగడం, సమస్యలు పరిష్కారం కావడం, కష్టనష్టాల్లోంచి బయటపడడం, సంతాన యోగం కలగడం వంటివి జరుగుతాయి. ఇది ప్రస్తుతం వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశులకు అత్యధికంగా వర్తిస్తుంది.
Updated on: Sep 29, 2025 | 1:36 PM

వృషభం: రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో, ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు లాభ స్థానంలో ఉండి, పరస్పరం చూసుకుంటున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు తప్పకుండా ఆస్కారముంటుంది. సామాజికంగా కూడా స్థాయి, హోదా, పలుకుబడి బాగా పెరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.

మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న శుక్ర గ్రహంతో దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడికి పరస్పర వీక్షణ ఏర్పడడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవడానికి సరికొత్త మార్గాలు అంది వస్తాయి. మీ ప్రతిభ, మీ పనితీరు సంతృప్తికరంగా ఉన్నందువల్ల అధికారులు పదోన్నతి కల్పించే అవకాశం ఉంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా కలసి వస్తుంది. విలాస జీవితం అలవడుతుంది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతాయి.

కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శుక్ర గ్రహంతో భాగ్య స్థానంలో ఉన్న శనీశ్వరుడికి వీక్షణ ఏర్పడినందువల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్య: ఈ రాశిలో ఉన్న శుక్రుడితో సప్తమ స్థానంలో ఉన్న శనికి శుభ దృష్టి ఏర్పడినందువల్ల ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగ జీవితంలో బాగా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి.

వృశ్చికం: పంచమ స్థానంలో ఉన్న శనీశ్వరుడితో లాభ స్థానంలో ఉన్న శుక్రుడికి పరస్పర వీక్షణ ఏర్పడి నందువల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా కలలో కూడా ఊహించని పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలు వైన ఆస్తి కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడం జరుగుతుంది.

మకరం: తృతీయ స్థానంలో ఉన్న రాశినాథుడు శనీశ్వరుడికి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడు వీక్షించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనూహ్యమైన ఫలితాలనిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ఉద్యోగుల విదేశీ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.



