- Telugu News Photo Gallery Spiritual photos Jupiter Mars Auspicious Aspect: Fortunes for These Zodiac Signs Telugu Astrology
Astrology: ఇక ఆ రాశుల వారికి ఆదాయం, అధికారం ఖాయం..! ఇందులో మీ రాశి ఉందా?
మిత్ర గ్రహాలైన గురు, కుజులు ఎక్కడ కలిసినా, ఎక్కడ పరస్పరం వీక్షించుకున్నా తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు ఆదాయానికి, అధికారానికి సంబంధించిన గ్రహాలైనందువల్ల కొన్ని రాశుల వారికి ఈ రెండు విషయాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. డిసెంబర్ 6 తేదీ నుంచి గురు, కుజ గ్రహాలు పరస్పరం వీక్షించుకోవడం జరుగుతుంది. ధనూ రాశిలో ప్రవేశించిన కుజుడికి, మిథున రాశిలో సంచారం మొదలుపెట్టే గురువుకు మధ్య పరస్పర వీక్షణ ఏర్పడుతోంది. ఇది జనవరి 16 వరకు కొనసాగుతుంది. దీనివల్ల మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు లభ్ధి పొందడం జరుగుతుంది.
Updated on: Nov 29, 2025 | 2:55 PM

మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడికి ధన కారకుడు, భాగ్య స్థానాధిపతి అయిన గురువుతో పర స్పర వీక్షణ ఏర్పడడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా పట్టే అవకాశం ఉంది. తప్పకుండా రాజపూజ్యాలు కలుగుతాయి. ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన ప్రాప్తి వంటివి కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

సింహం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కుజ గ్రహాన్ని లాభస్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల తప్పకుండా మహా భాగ్య యోగం కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో వీరు ఐశ్వర్యవంతులయ్యే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు. ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని ధన లాభం ఉంటుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

వృశ్చికం: ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడిని గురువు వీక్షించడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా రాజయోగం పడుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు భారీగా పెట్టుబడులు అందుతాయి. విలువైన ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశిలో ప్రవేశించిన కుజుడిని రాశ్యధిపతి గురువు వీక్షించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు కూడా ఘన విజయం సాధిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. రాజకీయ ప్రాభవం బాగా పెరుగుతుంది.

కుంభం: లాభ స్థానంలో సంచారం ప్రారంభించిన కుజుడిని పంచమ స్థానంలో ఉన్న గురువు చూడడం వల్ల ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలిస్థాయి. ధన శుభ యోగాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడంగానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.

మీనం: ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడిని రాశ్యధిపతి గురువు చూడడం వల్ల ప్రభుత్వ మూలక గుర్తింపు పొందడం జరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పదోన్నతి లభిస్తుంది. కొద్ది మార్పులతో వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభవార్తలు వింటారు.



